/rtv/media/media_files/2025/07/27/liver-damage-2025-07-27-19-57-20.jpg)
Liver Damage
Liver Damage: కాలేయం శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ప్రొటీన్లను ఉత్పత్తి చేయడంలో, జీర్ణక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ కాలేయం బలహీనపడినప్పుడు దాని ప్రభావం కేవలం కడుపులోనే కాకుండా.. ఇతర భాగాల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వేళ్లలో వచ్చే కొన్ని మార్పులు కాలేయంలో ఉన్న అస్వస్థతను ముందుగా తెలియజేస్తాయి. మన గోళ్లు, చేతివేళ్లు ఈ మార్పులను ప్రతిబింబిస్తూ.. శరీరంలోని లోపాలను సూచించే సంకేతాలుగా నిలుస్తాయి. ఆ సంకేతాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చేతి వేళ్లపై కాలేయ సమస్య లక్షణాలు:
గోళ్ల రంగు పసుపు లేదా తెల్లగా మారడం సాధారణంగా కాలేయ సమస్యకు సంకేతం. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో బిలిరుబిన్ స్థాయి పెరిగి జండిస్‌కు దారి తీస్తుంది. దీని ప్రభావం వల్ల గోళ్లు సహజ రంగును కోల్పోయి పసుపు లేదా తెల్లగా మారుతాయి. అలాగే కాలేయ సిర్రోసిస్ వల్ల శరీరంలో ద్రవ నిల్వ పెరిగి వేళ్లు వాపు, బరువు తగ్గినట్లుగా అనిపించవచ్చు. ఈ వాపు తరచుగా గమనించకపోవచ్చు కానీ దీని ద్వారా కాలేయ పనితీరులో అసమతుల్యత ఉన్నదని గుర్తించవచ్చు."పాల్మర్ ఎరిథెమా" అనే పరిస్థితిలో వేళ్ల మూలాలు, అరచేతులు ఎర్రగా మారడం కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా కాలేయ రుగ్మతలతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు కూడా సంకేతం.
ఇది కూడా చదవండి: చియా విత్తనాల ప్రయోజనాలను పొందడానికి ఉత్తమ మార్గం ఇదే
మరోవైపు గోళ్లు అసాధారణంగా వంకరగా మారడం లేదా తెల్లటి చారలు ఏర్పడడం కూడా కాలేయ ప్రోటీన్ ఉత్పత్తిలో లోపాన్ని సూచిస్తుంది. ఇది కాలేయ వైఫల్యం లేదా దీర్ఘకాలిక సిర్రోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంకేతంగా పరిగణించాలి. గోళ్ల రంగు నీలం లేదా ఊదా మాయం కావడం అంటే శరీరానికి సరైన ఆక్సిజన్ సరఫరా జరగడంలేదు. ఇది శ్వాస సంబంధిత సమస్యలతోపాటు కాలేయ సమస్యలకు సంబంధించి అత్యవసర వైద్య సహాయం అవసరమయ్యే సంకేతం. అందువల్ల.. వేళ్లలో కనిపించే ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కాలేయం ఆరోగ్యాన్ని సూచించే ముఖ్యమైన సూచనలుగా పనిచేస్తాయి. మీ వేళ్లు, గోళ్లలో ఏవైనా ఈ తరహా మార్పులు కనిపిస్తే.. వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:యోగా ద్వారా డయాబెటిస్ నివారణ.. కొత్త నివేదికలో చెబుతున్న నిజాలు ఇవే
( liver-damage | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)