Health Tips: మీ పిల్లల గొంతులో ఏమైనా ఇరుక్కుంటే.. ఈ 3 టిప్స్ పాటిస్తే సేఫ్!

పిల్లలకు అన్నం, పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలు తినిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు పొరపాటున వాటిని గొంతులో పట్టించుకునే ప్రమాదం ఉంది. పిల్లల శరీరం నీలంగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

New Update
stuck in child throat

Stuck Child Throat

పిల్లలకు ఆహారం తినిపించడం అనేది వారికి ఎదుగుదలకు, ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే ఆహారం ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు అన్నం, పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలు తినిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు పొరపాటున వాటిని గొంతులో పట్టించుకునే ప్రమాదం ఉంది. అందుకే వారికి సరిపడా చిన్న ముక్కలు చేసి ఇవ్వాలి. అలాగే వారు తినేటప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరం. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఆహారం తీసుకుంటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని.. పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు సరైన పద్ధతులను అనుసరించడం ఎంతో ముఖ్యం. పిల్లలు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3  సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా వస్తువు, ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటారు. ఈ సమయంలో వారికి చిన్న గింజలు, గుండ్రని వస్తువులు, నాణేలు వంటివి ఇవ్వకూడదు. 

పిల్లల ఆహారం గొంతులో ఇరుక్కుపోతే..

ఈ వస్తువులు ఊపిరి గొట్టంలో ఇరుక్కుపోయి ప్రాణాపాయానికి దారి తీస్తాయి. ఒకవేళ పిల్లల గొంతులో ఏదైనా వస్తువు ఇరుక్కుపోయినట్లయితే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు తొందరపడకుండా.. శాంతంగా వ్యవహరించాలి. మొదటిగా పిల్లల నోరు తెరిచి ఇరుక్కుపోయిన వస్తువు కనిపించినట్లయితే.. దానిని మెల్లిగా పైకి లాగాలి. దాన్ని లోపలికి తోయడానికి ప్రయత్నించకూడదు. ఇది పరిస్థితిని మరింత క్లిష్ట తరం చేస్తుంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. 16 నెలల చిన్నారి శనగ గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఇది కూడా చదవండి: ఈ 3 లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే.. వారు ఒక మేధావి అని అర్థం!

ఈ సంఘటన చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక లాంటిది. అలాగే వస్తువు ఇరుక్కుపోయినప్పుడు పిల్లలను నిలబెట్టి లేదా కూర్చోబెట్టి ఉంచాలి. పడుకోబెట్టకూడదు. పడుకోబెట్టడం వల్ల గొంతులో ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లిపోవచ్చు. ఇంకా పిల్లల వీపుపై మెల్లిగా 5-7 సార్లు తట్టడం వల్ల.. వారు దగ్గడం లేదా తుమ్మడం ద్వారా ఇరుక్కున్న వస్తువు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. పైన చెప్పిన పద్ధతుల వల్ల కూడా వస్తువు బయటకు రానట్లయితే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లల శరీరం నీలంగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తే. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారినట్లు గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు వారి దృష్టి మొబైల్ లేదా టీవీపై ఉండకుండా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కాలేయంతోపాటు మూత్రపిండాల సంరక్షణకు బీట్‌రూట్ రెసిపీస్

Advertisment
తాజా కథనాలు