Explainer: భారత్‌ను వెంటాడుతున్న క్యాన్సర్.. పెరుగుతున్న కేసుల వెనుక కారణాలు తెలుసుకోండి

క్యాన్సర్ కేసుల పెరుగుదల అనేది కేవలం వైద్యపరమైన సమస్యే కాదు. ఇది జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సంరక్షణ అలవాట్లు సామాజిక-ఆర్థిక ప్రతిబింబం. ప్రభుత్వం చికిత్సా సౌకర్యాలను విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధిని తొలి దశలోనే గుర్తించడంపై దృష్టి సారించాలి.

New Update
Cancer

Cancer

భారతదేశంలో క్యాన్సర్ (cancer cases in india) వ్యాధి భారం క్రమంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కొత్త కేసులు నమోదవుతుండగా.. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ఈ పెరుగుదలలో అత్యంత ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) - నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (NCRP) నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగానే కాకుండా.. ఢిల్లీలో కూడా క్యాన్సర్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2022లో 14.61 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య 2023లో 14.96 లక్షలకు, 2024లో 15.33 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ పెరుగుదలలో ఢిల్లీ పరిస్థితి కూడా తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న క్యాన్సర్ కేసుల వెనుక కారణాలేంటి? అనేదానిపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పెరుగుతున్న సంఖ్యలు: 

రాజధానిలోని ఆంకాలజీ (Oncology) సేవలు.. ఆసుపత్రులపై పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తున్నాయి. దేశంలో అత్యధిక కేసులతో ఉత్తరప్రదేశ్ (2.21 లక్షలు) అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. జనాభా సాంద్రతకు అనుగుణంగా (Age-Adjusted Incidence Rate - AAIR) చూస్తే... మెట్రో నగరాల్లో ఢిల్లీలోనే పురుషులలో అత్యధిక కేన్సర్ రేటు నమోదవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

క్యాన్సర్ కేసుల పెరుగుదలకు 3 ప్రధాన కారణాలు:

ఢిల్లీలో క్యాన్సర్ కేసులు(cancer case in 2025) వేగంగా పెరగడానికి మూడు ముఖ్య కారణాలు దోహదపడుతున్నాయని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. ఈ మూడు అంశాలు కలిసి పరిపూర్ణ తుఫాను (Perfect Storm) పరిస్థితులను సృష్టిస్తున్నాయి. మొదటిది జీవనశైలి మార్పులు డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ఢిల్లీలో అధిక ఒత్తిడి, పేలవమైన ఆహారపు అలవాట్లు (Junk/Processed Foods) క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఈ సమస్య తగ్గాలంటే సుదీర్ఘ పని గంటలు, తక్కువ శారీరక శ్రమ, ప్రాసెస్ చేసిన ఆహారం, పొగాకు, మద్యం వినియోగం పెరగడం వల్ల ప్రమాదం పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: నిరంతర నిద్రా? విడతల నిద్రా? గుండెకు, మెదడుకు ఏది ఉత్తమం..నిద్ర నాణ్యతపై నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోండి!!

కాలుష్యం:

ఢిల్లీలోని విషపూరితమైన గాలి (Toxic Air) క్యాన్సర్ పెరుగుదలకు ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కు ప్రధాన కారణంగా నిలుస్తోంది. పొగ తాగని (Non-Smokers) వ్యక్తులలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడానికి వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. PM 2.5 వంటి అతి సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయి దీర్ఘకాలిక వాపు లేదా జన్యుపరమైన నష్టాన్ని కలిగిస్తాయి.

ఆలస్యమైన రోగ నిర్ధారణ:

చిన్నపాటి లక్షణాలను పట్టించుకోకపోవడం, ఆలస్యంగా వైద్యులను సంప్రదించడం వంటి కారణాల వల్ల చాలామంది రోగులకు చివరి దశలో (Late Stages) క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. అప్పటికే వ్యాధి తీవ్రమై చికిత్స కష్టంగా మారుతోంది. చాలామంది రోగులు చిన్న వయస్సులోనే, చివరి దశలలో ఆసుపత్రికి వస్తున్నారు. చిన్నపాటి జీవనశైలి మార్పులు, సకాలంలో స్క్రీనింగ్ (Screening) చేయించుకోవడం వలన చాలా పెద్ద మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు పురుషులలో నోటి క్యాన్సర్ (Oral Cancer), స్త్రీలలో గర్భాశయ ముఖద్వార కేన్సర్ (Cervical Cancer) కూడా తరచుగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ పురుషులలో 41.2% క్యాన్సర్ కేసులకు పొగాకు (Tobacco) వాడకం కారణమని ఒక నివేదిక తెలిపింది.

క్యాన్సర్ భారం తగ్గించడానికి..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 770 జిల్లా NCD క్లినిక్‌లు, 6,410 CHC క్లినిక్‌లు, 364 జిల్లా డే-కేర్ కీమోథెరపీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. చికిత్సను బలోపేతం చేయడానికి.. 19 రాష్ట్ర క్యాన్సర్ సంస్థలు, 20 టెర్షియరీ క్యాన్సర్ కేంద్రాలు, కొత్త AIIMSలలో ఆంకాలజీ యూనిట్లను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ చికిత్స ఖర్చును తగ్గించడానికి.. అనేక క్యాన్సర్ ఔషధాలను జన ఔషధి కేంద్రాలు (Jan Aushadhi Kendras), AMRIT ఫార్మసీల ద్వారా 50 నుంచి 80 శాతం తక్కువ ధరలకు అందిస్తున్నారు. అనేక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ కూడా తగ్గించారు.  ఢిల్లీలో క్యాన్సర్ కేసుల పెరుగుదల అనేది కేవలం వైద్యపరమైన సమస్యే కాదు.. ఇది జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సంరక్షణ అలవాట్ల యొక్క సామాజిక-ఆర్థిక ప్రతిబింబం. ప్రభుత్వం చికిత్సా సౌకర్యాలను విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధిని తొలి దశలోనే గుర్తించడం (Early Detection), జీవనశైలి మార్పుల ద్వారా నివారణ (Prevention) పై దృష్టి సారించడం అత్యవసరం. ప్రతి పౌరుడు చిన్నపాటి లక్షణాలను కూడా విస్మరించకుండా.. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఈ పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడంలో భాగం కావాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మెదడుకు పదును 8 అలవాట్లు.. అద్భుతమైన జ్ఞాపకశక్తి కోసం ఇలా ట్రై చేయండి!!

Advertisment
తాజా కథనాలు