Thyroid
Thyroid: థైరాయిడ్ అనేది ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది శరీరంలోని పలు జీవక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ సంబంధిత సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఒకసారి ఈ సమస్యలలో ఏదైనా తలెత్తితే దీర్ఘకాలికంగా మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత వైద్య విధానాల్లో దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అయితే సరైన జీవనశైలి, ఆహార నియమాలు, వ్యాయామం వంటి విషయాలు పాటిస్తే థైరాయిడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.
శరీరానికి అవసరమైన పోషకాలు..
థైరాయిడ్ ఉన్నవారు కొన్ని కూరగాయలను తినరాదని అంటుంటారు. ముఖ్యంగా క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి తినడం వల్ల గ్రంథిపై ప్రభావం పడుతుందని, హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావని భావిస్తారు. కానీ ఈ అభిప్రాయం పూర్తిగా నిజం కాదు. శాస్త్రీయంగా చూస్తే ఇవి గోయిట్రోజెనిక్ పదార్థాలు అయినా తక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. థైరాయిడ్ ఉన్న వ్యక్తులు వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కాకపోతే తరచూ పెద్ద మొత్తంలో తీసుకోవడం మంచిదికాదు.
ఇది కూడా చదవండి: నిద్రపోయే ముందు ఇది పాలల్లో కలిపి తాగితే కొలెస్ట్రాల్ మాయం
అలాగే థైరాయిడ్ హార్మోన్లు కంట్రోల్‌లో లేకపోతే లేదా సమస్య తీవ్రమైతే తాత్కాలికంగా ఈ కూరగాయలను వాడకుండా ఉండటం మంచిది. కానీ శరీర పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా తీసుకుని కొద్దిగా తీసుకోవడంలో ఎలాంటి హానీ ఉండదు. వాస్తవానికి క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే. అవి తినకపోతే కొన్ని ముఖ్యమైన పోషకాలు కోల్పోతాం. కాబట్టి థైరాయిడ్ ఉన్నా సరే మితంగా తీసుకుంటే మేలు జరుగుతుంది. ముఖ్యంగా హార్మోన్లు కంట్రోల్‌లో ఉంటే ఎప్పటికప్పుడు మితంగా తినడం ద్వారా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మొలకెత్తిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?
( cauliflower-side-effects | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )