Sugar Levels
Sugar Levels: అన్నం తినడం మానేస్తే షుగర్ లెవల్స్ తగ్గుతాయని అనుకుంటే అది సరికాదు. ఎందుకంటే షుగర్‌ను ప్రభావితం చేసే అంశాలు అన్నం ఒక్కటే కావు. చాలా మంది డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినకపోయినా బరువు తగ్గకపోవడం, షుగర్ లెవల్స్ నియంత్రణలో లేకపోవడం వల్ల మళ్లీ మానసిక ఒత్తిడికి గురవుతారు. అయితే ఇది శరీర వ్యవస్థ, జీవక్రియలపై ఆధారపడి ఉంటుంది. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది తిన్న వెంటనే గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి వెళ్తుంది.
అన్నం బదులు చపాతీలు తినడం..
దానితో పాటు కూరలు, పెరుగు, పప్పు వంటి పదార్థాలు తింటే మొత్తం భోజన గ్లైసీమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. మరికొంతమంది రాత్రి అన్నం బదులు చపాతీలు తినడం మొదలుపెడతారు. కానీ ఇవి కూడా ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన గోధుమ పిండితో తయారవుతాయి. దాంతో ఇందులో ఫైబర్ అసలు ఉండదు. ఫైబర్ లేని ఆహారం కూడా గ్లూకోజ్‌గా వేగంగా మారుతుంది. అందుకే అన్నం తినకపోయినా లేదా చపాతీలకు మారినా మార్పు కనిపించకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం మాత్రం సిరి ధాన్యాలు. రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు వంటి సిరి ధాన్యాల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్‌ను వేగంగా పెరగనీయవు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం... భారీగా ట్రాఫిక్ జామ్
అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. మధ్యాహ్నం పూట తక్కువ మోతాదులో అన్నం తీసుకుని దానికి సరిపడా కూరగాయలు, పప్పులు, తాజా పండ్లు తీసుకుంటే బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగే రాత్రి సమయంలో బ్రౌన్ రైస్ లేదా సిరిధాన్యాలతో చేసిన ఉప్మా, ఖిచిడీ వంటి అల్పాహారాలు తీసుకుంటే ఇంకా మంచిది. బ్రౌన్ రైస్‌లోనూ ఫైబర్ ఉండడంతో పాటు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. తక్కువ మొత్తంలో అన్నం లేదా చపాతీలు తినడం కన్నా బ్రౌన్ రైస్ లేదా సిరిధాన్యాల వంటలు తీసుకోవడమే ఉత్తమం. ఆహార నియమాల్లో మార్పులు తీసుకురావడం, మితంగా తినడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. బరువు కూడా క్రమంగా తగ్గుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: థైరాయిడ్ ఉంటే కాలిఫ్లవర్, క్యాబేజీ తినవచ్చా?
(sugar-levels | rice | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )