Tamarind Rice: ఈ పొడి వేస్తే పులిహోర రుచి అదిరిపోతుంది

భారతీయ వంటకాలలో పులిహోరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని తరచుగా పండుగలు, శుభకార్యాలు, ఆలయ ప్రసాదంగా తయారు చేస్తారు. అయితే దేవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే పులిహోర రుచిని ఇంట్లోనే పొందాలంటే పులిహోర పొడి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Tamarind Rice

Tamarind Rice

పులిహోర భారతీయ వంటకాలలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఒక సంప్రదాయబద్ధమైన వంటకం. ఇది చింతపండు పులుసు, పప్పులు, సుగంధ ద్రవ్యాలతో వండిన అన్నం. దీనిని తరచుగా పండుగలు, శుభకార్యాలు, ఆలయ ప్రసాదంగా తయారు చేస్తారు. దీని రుచి పులుపు, కారం, ఉప్పుల కలయికతో చాలా బాగుంటుంది. అయితే పులిహోర అంటే ఇష్టపడనివారు చాలా అరుదుగా ఉంటారు. దేవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే పులిహోర(Tamarind Rice) రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రుచిని ఇంట్లోనే పొందాలంటే.. దానికి పులిహోర పొడి చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా, శుభ్రంగా పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

ధనియాలు - అర కప్పు

ఎండు మిరపకాయలు - 15 నుంచి 18

మెంతులు - 1 టీస్పూన్

నల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు - 1 టీస్పూన్

కరివేపాకు - 20 (ఎండబెట్టినవి)

పసుపు పొడి - 1 టీస్పూన్

ఇంగువ - అర టీస్పూన్

నూనె - కొన్ని చుక్కలు (వేగించడానికి)

తయారీ విధానం:

మొదటగా మందపాటి గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ధనియాలు వేసి బంగారు రంగు వచ్చేవరకు.. మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలను నూనె లేకుండా పొడిగా వేయించాలి. అవి కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలు వేసి అవి కూడా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. నల్ల నువ్వులు వేసి అవి చిటపటలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకును వేసి అది కూడా బాగా ఎండిపోయి కరకరలాడే వరకు వేయించాలి.

ఇది కూడా చదవండి: ఉపవాసం ఆరోగ్యానికి హానికరమా..? వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఈ పదార్థాలన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీనికి పసుపు పొడి, ఇంగువ కూడా కలిపి మెత్తగా కాకుండా, కొద్దిగా గరుకుగా ఉండేలా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడి ఒక నుంచి రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పులిహోర పొడిని ఉపయోగించి, వేడి అన్నంలో కలిపి, కొద్దిగా నూనె, చింతపండు గుజ్జు కలిపితే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉండే పులిహోర ఇంట్లోనే సిద్ధం అవుతుంది. ఈసారి మీరు కూడా ఈ పులిహోర పొడిని తయారు చేసి చూడండి.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి:మెదడు గుర్రంలా పనిచేయాలా.. అయితే ఇది తాగండి!!

Advertisment
తాజా కథనాలు