🔴Live News Updates: తిరుపతి విమానంలో భారీగా పొగలు.. ఆందోళనలో 65 మంది ప్రయాణికులు - హై టెన్షన్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

AP: తిరుపతి విమానంలో భారీగా పొగలు.. ఆందోళనలో 65 మంది ప్రయాణికులు - హై టెన్షన్!

శంషాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరిన విమానంలో నిన్న సాంకేతిక లోపం తలెత్తింది. రన్‌వేపై వెళ్తుండగా పొగలు వచ్చాయి. గమనించిన పైలట్ విమానాన్ని ఆపేశారు. ఇంజిన్‌లోని సమస్యను సరి చేసి.. మళ్లీ స్టార్ట్ చేయగా వాసన రావడంతో నిలిపివేశారు. మొత్తంగా రాత్రి బయల్దేరింది.

Shamshabad to Tirupati flight Technical glitch
Shamshabad to Tirupati flight Technical glitch

మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. శంషాబాద్‌ నుంచి తిరుపతికి నిన్న (ఆదివారం) రాత్రి వెళ్లవలసిన ఓ విమాన సర్వీస్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

విమానంలో దట్టమైన పొగలు

స్పైస్‌జెట్‌ SG-2138 విమానం ఆదివారం రాత్రి 7.30 గంటలకు శంషాబాద్‌ నుంచి బయల్దేరి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. కానీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విమానం గంట ఆలస్యంగా చేరుకుంది. రాత్రి 8.30 గంటలకు వచ్చింది. అనంతరం 65 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. ఇంజిన్ స్టార్ట్ చేసి రన్‌వే వైపు మెల్లగా కదిలింది. 

Also Read:ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

ఇంజిన్‌లో వాసన

ఈ క్రమంలో ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం స్టార్ట్ చేశాయి. అది గమనించిన పైలట్ ATC అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంజిన్‌లో ఉన్న టెక్నికల్ ఇష్యూని సరిచేశారు. ఆ తర్వాత కూడా ప్రయాణికులను సేఫ్‌గా గమ్యస్థానాలకు దించేందుకు మళ్లీ ఇంజిన్ స్టార్ట్ చేయగా వాసన రావడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశారు. 

Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?

ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోలన చెందారు. విమానం బయల్దేరడానికి సుమారు మూడున్నర గంటల పాటు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ప్రయాణికులను మూడుసార్లు విమానంలోకి ఎక్కించి కిందకు దించారు. ఎట్టకేలకు రాత్రి 10.54 గంటలకు విమానం తిరుపతికి బయల్దేరి క్షేమంగా వెళ్లింది. 

Also Read:దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య

  • Jun 16, 2025 14:00 IST

    BIG BREAKING : కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం

    ఫార్ములా-ఈ రేసులో  బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌కు తాళాలు వేశారు.

    Formula E race case



  • Jun 16, 2025 13:59 IST

    Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. భార్య మాట విని బతికిపోయిన భర్త

    అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఉమాంగ్ పటేల్ అనే డాక్టర్ త్రుటిలో తప్పించుకున్నారు. జ్వరం రావడంతో అతడు తన భార్య, ఫ్యామిలీ మాట విని టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం తన భర్య, ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పారు.

    Gujarat Doctor Cancels Air India Flight Ticket To London That Later Crashed
    Gujarat Doctor Cancels Air India Flight Ticket To London That Later Crashed

     



  • Jun 16, 2025 11:24 IST

    Raja Saab Teaser Day: 'రాజాసాబ్‌' టీజర్‌ డే.. గ్రాండ్ సెలబ్రేషన్స్ షురూ..!

    ప్రభాస్ అభిమానులకి పండుగ రోజు రానే వచ్చింది.. ఉదయం 9:30 AMకి 'ప్రభాస్' కటౌట్ లాంచ్ @ ప్రసాద్ ఐమాక్స్.. హైదరాబాద్ సినీ ప్రియులకు చిరపరిచితమైన ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద ఉదయం టీజర్‌ లాంచ్ ప్రత్యేక వేడుకలు ప్రారంభమయ్యాయి.

    Raja Saab Teaser Day
    Raja Saab Teaser Day

     



  • Jun 16, 2025 07:59 IST

    Dhanush: ధనుష్ డైరెక్షన్ లో పవన్.కళ్యాణ్ ... 'కుబేరా' హీరో కామెంట్స్ వైరల్!

    కోలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్ టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ధనుష్ కామెంట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కాంబో నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    Kuberaa Official Trailer
    Kuberaa Official Trailer

     



  • Jun 16, 2025 07:58 IST

    Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!

    ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన కుబేరా ట్రైలర్ విడుదలైంది. డబ్బు, ఎమోషన్స్ చుట్టూ సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్- నాగార్జున మధ్య భావోద్వేగ  సన్నివేశాలు హైలైట్ గా కనిపించాయి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈచిత్రం జూన్ 20న విడుదల కానుంది.

    Kuberaa Trailer
    Kuberaa Trailer

     



  • Jun 16, 2025 07:58 IST

    Telangana: తెలంగాణలో దారుణం.. ‘నేను చాలా రిచ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా’ - మహిళను రేప్ చేసి రూ.24 లక్షలతో పరార్!

    హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ముంబైకి చెందిన కల్పేష్ శశికాంత్ బేగంపేటకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడు. అనంతరం ఆమె నుంచి రూ.24 లక్షలు వసూళు చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    Hyderabad Begumpet Women sexually assaulted name of marriage
    Hyderabad Begumpet Women sexually assaulted name of marriage

     

     



  • Jun 16, 2025 07:57 IST

    Hyderabad: బట్టతలపై జుట్టు అనగానే బుట్టలో పడ్డారు...తీరా చూస్తే...

    "అయ్యయ్యో ...చేతిలో డబ్బులు పోయెనే..అయ్యయ్యో ...జేబులు ఖాళీ ఆయెనే..ఉన్నది కాస్తా ఊడింది...సర్వ మంగళం పాడింది.' అన్నట్లయింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తామనగానే క్యూ కట్టి మరి డబ్బులు సమర్పించుకున్నారు. 56వేలమంది నుంచి డబ్బులు వసూలు చేసింది సల్మాన్ గ్యాంగ్.

    Bald Head



  • Jun 16, 2025 07:56 IST

    Telugu Pastors: అనుమతి లేకుండా మత ప్రచారం..ఖతర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు

    గల్ఫ్‌చట్టాలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మతప్రచారకులను ఖతర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విజిటింగ్‌ వీసాపై ఖతర్‌ వెళ్లి అక్కడ మత ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వారిలో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.

    Telugu pastors in custody of Qatar police



Advertisment
Advertisment
తాజా కథనాలు