Dhanush-Pawan Kalyan: హీరో ధనుష్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తమిళ్లో 'రాయన్', 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం' వంటి సినిమాలతో దర్శకుడిగా సూపర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం 'ఇడ్లీ కడై' అంటూ మరో సినిమా కూడా మొదలు పెట్టారు. అయితే తాజాగా కుబేరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ధనుష్.. దర్శకుడిగా తన టాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ లో
పవర్ స్టార్ తో సినిమా
తెలుగులో సినిమా డైరెక్ట్ చేస్తే.. ఫస్ట్ ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? అని అడగగా.. ధనుష్ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలనుంది అంటూ తన కోరికను తెలిపారు. ధనుష్ కామెంట్స్ తో ఆడిటోరియం అంతా అరుపులు, కేకలతో మారుమోగిపోయింది. దీంతో ఫ్యాన్స్ ఇది త్వరగా జరిగితే బాగుండు అని అనుకుంటున్నారు. ధనుష్- పవన్ కాంబో నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
A moment that lit up the Kubera pre-release Event! 💥@dhanushkraja shared that he wishes to direct the one and only @PawanKalyan garu 🔥#PawanKalyan#Dhanush#KuberaaPreReleaseEvent#KuberaaTrailer#SIIMApic.twitter.com/Nvq9La9G5L
— SIIMA (@siima) June 15, 2025
ఇదిలా ఉంటే ధనుష్ ప్రస్తుతం 'కుబేరా' మూవీ (Kuberaa movie) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్- నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. డబ్బు, ఎమోషన్, మాఫియా వంటి అంశాలతో శేఖర్ కమ్ముల ఓ కొత్త కథను పరిచయం చేయబోతున్నట్లు అనిపిస్తుంది.
Also Read: Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!