Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన కుబేరా ట్రైలర్ విడుదలైంది. డబ్బు, ఎమోషన్స్ చుట్టూ సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్- నాగార్జున మధ్య భావోద్వేగ  సన్నివేశాలు హైలైట్ గా కనిపించాయి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈచిత్రం జూన్ 20న విడుదల కానుంది.

New Update

Kuberaa Trailer: హీరో ధనుష్ , కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కుబేరా' ఈ నెల 20న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ . డబ్బు, ఎమోషన్స్ చుట్టూ సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్- నాగార్జున మధ్య భావోద్వేగ  సన్నివేశాలు హైలైట్ గా కనిపించాయి.అలాగే రష్మిక - ధనుష్ మధ్య సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. 

ట్రైలర్ 

ట్రైలర్ లో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా .. నాగార్జున ప్రభుత్వ అధికారి పాత్రను పోషించారు. నాగార్జున జీవితంలోకి ధనుష్ రాక సినిమా కథను ఎలా మలుపు తిప్పింది అనే అంశాలు ఆసక్తికరంగా కనిపించాయి. మొత్తానికి ఈ సినిమా మాఫియా, డబ్బు, ఎమోషన్స్ నేపథ్యంలో సాగనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

Advertisment
తాజా కథనాలు