Raja Saab Teaser Day
Raja Saab Teaser Day: ప్రభాస్ అభిమానులకి పండుగ రోజు రానే వచ్చింది.. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రోజు వచ్చేసింది. 'సలార్', 'కల్కి 2898 ఎడీ'తో వరుసగా విజయం సాధించిన ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన షేడ్లో ‘ది రాజా సాబ్’ ద్వారా అలరించబోతున్నారు. ఈసారి హారర్, కామెడీ, రొమాన్స్ కలయికతో కామెడీకి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారు. దింతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.. ఈ రోజు (జూన్ 16) టీజర్ రిలీజ్ డే కావడంతో, మేకర్స్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు.
STAR STAR REBEL STAR 🌟 #Prabhas #TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/dcRXAElb1J
— The RajaSaab (@rajasaabmovie) June 16, 2025
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
ఉదయం 9:30 AM - 'ప్రభాస్' కటౌట్ లాంచ్ @ ప్రసాద్ ఐమాక్స్
హైదరాబాద్ సినీ ప్రియులకు చిరపరిచితమైన ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద ఉదయం ప్రత్యేక వేడుకలు ప్రారంభమవుతున్నాయి. ఐమాక్స్ దగ్గర ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య ప్రభాస్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
Let the celebration begins 💥💥💥#Prabhas #TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/4AQoHqpnqY
— The RajaSaab (@rajasaabmovie) June 16, 2025
KING-SIZE CUTOUT LAUNCH amidst an ocean of fans 🔥🔥
— The RajaSaab (@rajasaabmovie) June 16, 2025
PRASAD’s MULTIPLEX 🌋 #Prabhas #TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/GT61HnJWYd
Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!
ఉదయం 10:52 AM - ‘ది రాజా సాబ్’ టీజర్ లాంచ్
కటౌట్ లాంచ్ అనంతరం, అదే వేదికపై ప్రసాద్ లార్జ్ స్క్రీన్‌లో 'ది రాజా సాబ్' టీజర్‌ను మొట్టమొదటిగా ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో మీడియా ప్రతినిధులతో పాటు, ఫ్యాన్స్ కూడా పాల్గొననున్నారు. అదే టైమ్ కి ఈ టీజర్ యూట్యూబ్‌లోనూ విడుదల కానుంది.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
మధ్యాహ్నం:
‘ది రాజా సాబ్’ మూవీ కోసం రూపొందించిన సాంప్రదాయ హవేలీ సెట్, అలాగే ఇతర ముఖ్యమైన లొకేషన్స్‌ను మీడియా ప్రతినిధులకు ప్రత్యక్షంగా చూపించనున్నారు మూవీ టీమ్. ఈ సెట్లు అజీజ్ నగర్‌లోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియో, అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద భారీ స్థాయిలో నిర్మించారు.
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నంబియార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ గ్రాండ్ సెట్లు సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి.
Also Read: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
సాయంత్రం - డైరెక్టర్ మారుతి & టీం మీడియాతో చిట్‌చాట్
అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక, దర్శకుడు మారుతి, నిర్మాతలు మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు. ప్రభాస్ పాత్ర పై విశేషాల ఆసక్తికర విషయాలు తెలియజేయనున్నారు.