/rtv/media/media_files/2025/06/16/rvD3F8PPGMNxGkL7sqyi.jpg)
Hyderabad Begumpet Women sexually assaulted name of marriage
రోజు రోజుకూ కామాంధుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మహిళ కనిపిస్తే ఏ విధంగా వారిని లోబరుచుకుని అత్యాచారం చేద్దామా? అనే ఆలోచనలోనే కొందరు ఉంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనను నమ్మిన ఓ మహిళను నట్టెటా ముంచేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను రేప్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ మహిళ నుంచి రూ.లక్షల్లో నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన మరెక్కడో కాదు.. తెలంగాణలోని బేగంపేటలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
ఫేస్ బుక్‌లో పరిచయం
బేగంపేటలోని రసూల్‌పురాకు చెందిన 47 ఏళ్ల ఓ మహిళకు ముంబైకి చెందిన 42 ఏళ్ల కల్పేష్ శశికాంత్ కక్కడ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపించాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన ఆ మహిళ అతడి రిక్వెస్ట్‌ను యాక్సప్ట్ చేసింది.
ఇలా ఇద్దరి మధ్య పరిచయం బలపడింది. దీంతో 2023 జనవరిలో కల్పేష్ ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. బేగం పేటలోని ఓ హోటల్‌లో బస చేశాడు. అనంతరం ఆ మహిళను ఆ హోటల్‌కు రప్పించి మాట్లాడాడు.. తనకు చాలా ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని బాగా నమ్మించాడు. ఆ తర్వాత ఆమెను తన మాయలోకి దింపి అత్యాచారం చేసాడు.
అలా ఆ మహిళ సోదరి కూతురు బ్యాంక్ అకౌంట్ నుంచి షేర్ మార్కెట్‌లో విపరీతంగా పెట్టుబడులు పెట్టాడు. ఇలా ఆ మహిళతో పాటు ఆమె బంధువులు, స్నేహితుల నుంచి రూ.22 లక్షల వరకు అప్పు చేశాడు. మరోసారి కూడా పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు వస్తాయని చెప్పి రూ.2 లక్షలు తీసుకుని ముంబైకి పారిపోయాడు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
అనంతరం ఆ మహిళ ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానన్నావ్.. డబ్బులు విషయం ఏమైంది అని అడగ్గా.. ఆమెను బెదిరించాడు. ఆమెతో కలిసి న్యూడ్‌గా దిగిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బయపెట్టాడు. దీంతో ఆ మహిళ ఏం చేయాలో తెలియక శనివారం బేగంపేట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిపై రేప్, మోసం కింద కేసు ఫైల్ చేశారు.