/rtv/media/media_files/2025/06/16/HBrFJRtyInKZlKfCsXYt.jpg)
Shamshabad to Tirupati flight Technical glitch
మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి తిరుపతికి నిన్న (ఆదివారం) రాత్రి వెళ్లవలసిన ఓ విమాన సర్వీస్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
విమానంలో దట్టమైన పొగలు
స్పైస్‌జెట్ SG-2138 విమానం ఆదివారం రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. కానీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానం గంట ఆలస్యంగా చేరుకుంది. రాత్రి 8.30 గంటలకు వచ్చింది. అనంతరం 65 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. ఇంజిన్ స్టార్ట్ చేసి రన్‌వే వైపు మెల్లగా కదిలింది.
Also Read:ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!
ఇంజిన్‌లో వాసన
ఈ క్రమంలో ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం స్టార్ట్ చేశాయి. అది గమనించిన పైలట్ ATC అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంజిన్‌లో ఉన్న టెక్నికల్ ఇష్యూని సరిచేశారు. ఆ తర్వాత కూడా ప్రయాణికులను సేఫ్‌గా గమ్యస్థానాలకు దించేందుకు మళ్లీ ఇంజిన్ స్టార్ట్ చేయగా వాసన రావడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశారు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోలన చెందారు. విమానం బయల్దేరడానికి సుమారు మూడున్నర గంటల పాటు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ప్రయాణికులను మూడుసార్లు విమానంలోకి ఎక్కించి కిందకు దించారు. ఎట్టకేలకు రాత్రి 10.54 గంటలకు విమానం తిరుపతికి బయల్దేరి క్షేమంగా వెళ్లింది.
Also Read:దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య