/rtv/media/media_files/2025/06/16/vfGzz6RpwmPA0fhFXC0Y.jpg)
Telugu pastors in custody of Qatar police
Telugu pastors : గల్ఫ్ చట్టాలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మతప్రచారకులను ఖతర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఖతర్ వెళ్లి అక్కడ మత ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. భారతదేశం నుంచి 11 మంది పాస్టర్లు ఈ ప్రచారానికి వెళ్లగా వారిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. స్థానిక క్రైస్తవ వర్గాల సమాచారం మేరకు.. దోహానగరంలోని తుమమా అనే ప్రాంతంలో వీరంతా మత ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వీరిలో ముగ్గురు విజిటింగ్ వీసాలపై వచ్చినవారని పోలీసులు గుర్తించారు.
కాగా, 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండువారాలు దాటినట్లు తెలుస్తోంది. అయితే వీరిని ప్రస్తుతం విడిచిపెట్టినా, దేశం విడిచి వెళ్లడానికి మాత్రం అనుమతి లభించలేదు. నిజానికి గల్ఫ్ పూర్తిగా ముస్లీం కంట్రీ. అయితే గల్ఫ్‌లోని చాలా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వలసవెళ్లి వివిధ వృత్తులు చేస్తున్నవారితో ప్రత్యేక కాలనీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఖతర్‌కు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. వారిలో అన్ని మతాలవారు ఉన్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇండియా నుంచి వెళ్లినవారిలో ఎక్కువమంది క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా ఇండియాకు చెందిన పాస్టర్లను పిలుపించుకుని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. కానీ, ఖతర్‌లో బహిరంగ మత ప్రచారంపై నిషేధం ఉంది. కాకపోతే క్రైస్తవులు ప్రార్థనలు చేసుకోవడానికి బర్వా అనే ప్రాంతంలో విశాలమైనటువంటి కాంపౌండ్ ఏర్పాటు చేశారు.
Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
ఖతర్‌లో ఉన్న ప్రత్యే కాంపౌండ్‌లో మాత్రమే చర్చి ప్రార్థనలకు అనుమతి ఉండటంతో పాటు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారతదేశానికి చెందిన క్రైస్తవ మతస్థులకు ఖతర్ ప్రభుత్వం విజిటింగ్ విసాలను జారీ చేస్తోంది. కానీ, అక్కడి చట్టాలకు విరుద్ధంగా కొంతమంది ఇండియన్స్ అత్యుత్సాహంతో నివాస ప్రాంతాలు, విల్లాలు, భారతీయులు ఎక్కువగా ఉన్నచోట ఇష్టరీతిన చర్చిలు ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఉన్నచోట ఈ పోకడ ఎక్కువగా ఉందన్న విమర్శలు వినవిస్తున్నాయి. ఇండియా నుంచి వెళ్లిన పాస్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మత ప్రచారం చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
చట్టబద్ధ అనుమతి లేకుండా ఇష్టరీతిన ఏర్పాటు చేస్తున్న చర్చిలపై అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఖతర్, ఇతర గల్ఫ్ దేశాల్లో చట్టబద్ధంగా ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉన్నా, అన్యమత ప్రచారం చేయడం మాత్రం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. గతంలో సిక్కులు కూడా అనుమతి లేకుండా గురుద్వారా ఏర్పాటు చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని దాన్ని మూసివేశారు. కాగా ప్రస్తుతం క్రైస్తవ మత ప్రచారకుల పట్ల ఖతర్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు