Malla Reddy Lands : సుచిత్రలో హై టెన్షన్‌.. మల్లారెడ్డి భూమలు సర్వే

మాజీమంత్రి మల్లారెడ్డి భూముల్లో మరోసారి వివాదం చెలరేగింది. సుచిత్రలో ఉన్న భూములు సర్వే చేయడానికి అధికారులు చేరుకోగా సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారంటూ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. సర్వేపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

New Update
Malla Reddy

Malla Reddy

మాజీమంత్రి మల్లారెడ్డి భూముల్లో మరోసారి వివాదం చెలరేగింది. సుచిత్రలో ఉన్న భూములు సర్వే చేయడానికి అధికారులు అక్కడికి చేరుకోగా సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారంటూ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. అధికారుల తీరును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి తప్పుపట్టడంతో హైటెన్షన్‌ క్రియేటైంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని  సుచిత్ర జంక్షన్ సమీపంలో సర్వే నెంబర్ 82, 83 లలో మాజీమంత్రి మల్లారెడ్డి పేరుతో భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూముల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. గత ఏడాది జూన్‌ రెండోవారంలో  ఇదే భూమి విషయమై వివాదం కొనసాగింది. దీంతో అధికారులు కేసలు నమోదు చేశారు. తాజాగా తిరిగి సర్వే చేయడానికి అధికారులు రావడంతో మరో వివాదం చెలరేగింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. ఈ దశలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చేసేది లేక అధికారులు మరోసారి నోటీసులు అందజేసి సర్వే చేస్తామని చెప్పి వెళ్లి పోయారు.

Also Read: J&K: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ..కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ముఫ్తీ

Mallareddy Land Survey

ఈ భూమి చాలాకాలంగా వివాదంలోనే ఉంది. సర్వేనెంబర్ 82/1/EEలో 2015లో కె సుధామ, మరో ఎనిమిది మంది 3,393 గజాల భూమిని కొనుగోలు చేశారు. వారిలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న తరువాత ఆ భూమిని 2021లో సేరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అందరూ కలిసి అమ్మారు. కాగా 2024లో  యజమాని 2024 మే రెండో వారంలో పొజిషన్ లోకి వెళ్లడానికి ప్రయత్నించారు.  విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డిలు అక్కడికి వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. కాగా అప్పుడు ఇరువర్గాల మీద కేసులు నమోదు కాగా తిరిగి అధికారులు సర్వే కోసం రావడంతో మరోసారి వివాదం చెలరేగింది.

 ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
కాగా సర్వే అర్ధాంతరంగా నిలిపివేయడంపై అధికారులు స్పందిస్తూ నిబంధనలకు అనుగుణంగానే ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చామని, అయితే ఆ నోటీసుల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు లేకపోవడంతోనే ఆయన అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరుతో నోటీసులు జారీ చేశామని వారు తెలిపారు. కాగా తన పేరుపై నోటీసులు రాలేదని మర్రి అభ్యంతరం చెప్పడంతో సర్వేను నిలిపివేశామన్నారు. మరోసారి నోటీసులు ఇచ్చి సర్వే చేస్తామని వారు స్పష్టం చేశారు.     

 Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

Also Read :  ఏసీ కంప్రెసర్ పేలడంతోనే అగ్ని ప్రమాదం.. దీనికి గల కారణాలేంటి?

land issues | suchitra | mallareddy-campus | brs mla mallareddy

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు