Bomb Blast : కాలిఫోర్నియాలో బాంబు పేలుడు.. ఒకరు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా FBI దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది.

New Update
Bomb blast

Bomb blast

Bomb blast :  అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న  ఆస్పత్రి వద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, దాదాపు నలుగురు గాయపడ్డారు.

Bomb Explosion In California

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

 ప్రమాద ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్య అని FBI ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాద ఘటనపై స్పందించిన FBI లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ పూర్తి్స్థాయి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!

కాగా సంతానోత్పత్తి క్లినిక్‌ కు సమీపంలో ఒక కారు నిలపి ఉంది. అందులోనే బాంబు పెట్టి ఉంటారని లేదంటే కారు కు సమీపంలో బాంబు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇది ముమ్మాటికి ఉగ్రవాదచర్యేనని FBI అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ స్పష్టం చేశారు. ఇది అంతర్జాతీయ ఉగ్రవాద సంఘటనా లేక దేశీయ ఉగ్రవాద కేసునా అనే దానిపై FBI దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. కాగా పేలుడు సంభించిన సమయంలో ఎక్కువగా జనం లేకపోవడంతో ప్రాణనష్టం తగ్గిందని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా చుట్టుపక్కల అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి.  

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

 

hospital | bomb blast case | bomb-attack | bomb-blast | america

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు