Kishan Reddy: హైదరాబాద్ సంస్ధానం మూడు రాష్ట్రాల్లో విస్తరించింది

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ ముగింపు కార్యక్రమంలో భాగంగా రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ ఆపీస్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి రేపు జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హొ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నట్లు తెలిపారు.

Kishan Reddy: హైదరాబాద్ సంస్ధానం మూడు రాష్ట్రాల్లో విస్తరించింది
New Update

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ ముగింపు కార్యక్రమంలో భాగంగా రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ ఆపీస్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి రేపు జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హొ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా వంటి పారా మిటలరీ బలగాల కవాతులు ఉంటాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సంస్థానం మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని కిషన్‌ రెడ్డి తెలిపారు.ఈ సంస్థానం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించి ఉందన్న ఆయన.. విమోచన దినోత్సవ వేడుకల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారులు సైతం పాల్గొంటారని వెల్లడించారు.

రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారి కుటుంబాలను ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో బీజేపీ పార్టీ వారిని సన్మానించనుందన్నారు. మరోవైపు హైదరాబాద్‌ విమోచన దినోత్సవానికి సంబంధించి వర్చువల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నట్లు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న అమిత్‌ షా రాంజీ గోండు, షోయబుల్లా ఖాన్‌ పేర్ల మీద పోస్టర్లు విడుదల చేస్తారన్నారు.

అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ బర్త్‌ డే సందర్భంగా అమిత్‌ షా 150 మంది దివ్యాంగులకు 150 బ్యాటరీ ట్రై సైకిల్‌లను పింపణీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల అనంతరం హైదరాబాద్‌ సంస్థానానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలంగాణ బీజేపీ చీఫ్‌ గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం గురించి వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం దీనిని బీజేపీ పార్టీ కార్యక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తోందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ పార్టీ  cwc మీటింగ్‌ ఎందుకు పెట్టిందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విమోచన దినోత్సవానికి పొటీగానే కాంగ్రెస్ పార్టీ ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

#brs #kcr #congress #telangana #hyderabad #bjp #meeting #kishan-reddy #central-government #state-government #cwc #liberation #day-celebrations #institution #untruths
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe