Olympics Winners : ఒలింపిక్స్ విజేతలకు డబ్బులే డబ్బులు..
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కాసుల వర్షం కురుస్తోంది. పతకాలు తెచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటూ సొంత రాష్ట్రాల ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కాసుల వర్షం కురుస్తోంది. పతకాలు తెచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటూ సొంత రాష్ట్రాల ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి.
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా... మూఢనమ్మకాలు, చేతబడులు ఇంకా ఏదోక మూల వాటి ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ప్రజల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందిస్తే ఇలాంటి సామాజిక రుగ్మతలన్నీ మాయమవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.
AP: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. రేపు పోలవరం పరిశీలనకు కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది. దీనిపై నివేదిక ఇవ్వనుంది.
సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడింది. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నేతన్నలు పరిశ్రమ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కులను తగ్గించాలని..సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునేంత వరకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పోస్టులను భర్తీ చేయవద్దని టీఎస్ పీఎస్సీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రేపు జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హొ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలిపారు.