Kishan Reddy: హైదరాబాద్ సంస్ధానం మూడు రాష్ట్రాల్లో విస్తరించింది
ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రేపు జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హొ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలిపారు.