Asaduddin Owaisi: ఏపీలో జగన్ పాలనపై అసదుద్దీన్ ఏమన్నాడంటే.! ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. By Karthik 26 Sep 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నా అవి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేవని ఎద్దేవా చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఏపీ ప్రభుత్వ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో గతంలో కంటే మంచి పాలన అందిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే బాగుంటుందన్నారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్మొచ్చన్న ఆయన.. చంద్రబాబును మాత్రం అస్సలు నమ్మకూడదన్నారు. చంద్రబాబు నాయుడు సొంత మామను నమ్మించి మోసం చేశాడని విమర్శించారు. మరోవైపు రానున్న రోజుల్లో మజ్లిస్ పార్టీ ఏపీలో కూడా పోటీ చేస్తుందన్నారు. 170 స్థానాల్లో పోటీ చేయబోమన్న ఆయన.. కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అవి ఏఏ స్థానాలు అనే విషయంలో మాత్రం ఆయన క్లారీటి ఇవ్వలేదు. మరోవైపు తెలంగాణలో తాము బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయబోతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మజ్లిస్ పార్టీ పోటీ చేస్తున్న ప్రాతాల్లో ప్రజలు మజ్లిస్‌కు మాత్రమే ఓటు వేయాలన్నారు. ఇతర ప్రాంతాల్లో మాత్రం బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలించాలని ఎంపీ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తే రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని హైదరాబాద్ ఎంపీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు నెలలకో సీఎం మారుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో హింస చెలరేగే అవకాశం అధిక శాతం ఉందని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. #pawan-kalyan #andhra-pradesh #brs #kcr #telangana #chandrababu #bjp #ysrcp #mim #jagan-mohan-reddy #jana-sena #asaduddin-oyc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి