BIG BREAKING: అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..నలుగురు పరిస్థితి విషమం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
న్యూయార్క్‌లోని క్వీన్స్ సౌత్ ఓజోన్ సాక్కకలోని దీపావళి బాణాసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో రెండు ఇళ్ళు కాలిపోగా..ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
పాకిస్తాన్లో ప్రవహించే ముఖ్యమైన నది కునార్పై డ్యామ్‌లను వీలైనంత త్వరగా నిర్మించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌గా మారనుంది. కునార్ నది పాకిస్తాన్ వ్యవసాయం, నీటి అవసరాలకు కీలకం.
భారతదేశ సరిహద్దులో చైనా కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్నది. ఉపగ్రహ చిత్రాల ద్వారా లడఖ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో చైనా ఓ వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. ఈ చర్య భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
పాకిస్థాన్-అప్గానిస్థాన్ మధ్య అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీనివల్ల అక్కడి ప్రజలకు ఇది పెను భారంగా మారింది. ప్రస్తుతం పాక్‌లో కిలో టమాటాల ధర రూ.600 పాకిస్థానీ రూయాయలు ఉన్నట్లు సమాచారం.
చమురు సంస్థల ఆంక్షలపై అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ మధ్య వార్ నడుస్తోంది. ఆంక్షలకు తలొగ్గేది లేదని అన్న పుతిన్ వ్యాఖ్యలకు..తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలలు ఆగండి తెలుస్తుంది అంటూ ట్రంప్ హెచ్చరించారు.
వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటే అమెరికా మద్దతు పూర్తిగా ఉపసంహరించుకోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తాను అరబ్ దేశాలకు మాటిచ్చానని..అందుకే వాళ్ళు అలా చేయలేరని అన్నారు.
రష్యా నుంచి చమురును కొనడం భారత్ తగ్గించుకుంటుందని వైట్ హౌస్ మరోసారి పునరుద్ఘాటించింది. అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు దీనికి వారు ఒప్పుకున్నారని తెలిపింది. చైనా కూడా ఇదే బాటలో పయనిస్తుందని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.