/rtv/media/media_files/2025/10/24/trump-2-2025-10-24-07-31-14.jpg)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను వైట్‌హౌస్ తూచా తప్పకుండా వల్లెవేస్తోంది. ఆయన ఏం చెబితే అదే ఫాలో అయిపోతూ ప్రకటనలు జారీ చేస్తోంది. తాజాగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళను తగ్గించుకుంటుందని వైట్ హౌస్ ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు దీనికి వారు ఒప్పుకున్నారని తెలిపింది. వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రెస్ మీటింగ్‌లో దీని గురించి మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా ముగించడంలేదని..దీనిపై ట్రంప్ చాలా నిరాశగా ఉన్నారని ఆమె తెలిపారు. రష్యాను దారిలోకి తెచ్చేందుకే చమురుపై ఆంక్షలు విధిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు కరోలిన్ లీవిట్. అందుకే రెండు అతి పెద్ద కంపెనీలపై ఆంక్షలు విధించామని చెప్పారు. ఇందులో భాగంతగానే భారత ప్రధానితో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారని..చమురు కొనుగోళ్ళను తగ్గించుకోమని అభ్యర్థించారని తెలిపారు. అందుకు ఇండియా కూడా ఒప్పుకుందని లీవిట్ చెప్పుకొచ్చారు. మరోవైపు చైనా కూడా భారత్ బాటలోనే పయనిస్తోందని..ఆ దేశం కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించుకుంటోందనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. కానీ భారత్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. దేశ అవసరాలకు తగ్గట్టే..ఎవరితో వాణిజ్యం చేయాలి, ఎంత చేయాలి అనేది నిర్ణయిస్తామని చెబుతోంది.
US reiterates India scaling down Russian oil buy.
— IndiaToday (@IndiaToday) October 24, 2025
US also claimed that President Trump requested India to stop oil purchase, and that even China has started to Reduce Russia oil buy.#UnitedStaes#India#China#Russia#Oil | @anchorAnjaliPpic.twitter.com/ctgzBrSe7m
రెండు చమురు కంపెనీలపై..
అంతకు ముందు నిన్న ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రష్యాపై డైరెక్ట్ అటాక్ మొదలెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చర్చలతో టైమ్ వేస్ట్ అన్న ఆయన రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలను విధించారు. మాస్కో యుద్ధ నిధులను అరికట్టడానికి, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకుని రావడం ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా రష్యాలోని అతి పెద్ద చమురు సంస్థలైన రోస్‌నెస్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు ప్రకటించారు. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ప్రకటన జారీ చేసింది. రెండు పెద్ద చమురు సంస్థలు...వాటి అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆంక్షలను అమలు చేయనున్నామని తెలిపింది. రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలపై విధించిన ఆంక్షలతో మాస్కో దిగి వస్తుందని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. దీని వలన ఆదేశానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని..దాని నుంచి తప్పించుకోవడానికి అయినా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
Follow Us