Nobel Peace Prize Winner Machado :మహాత్మా గాంధీ ఆదర్శం..నోబెల్ శాంతి బహుమతి విన్నర్ మచాదో

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాదో తనకు ప్రేరణ మహాత్మా గాంధీ అని చెప్పారు. ఆయన సలిపిన స్వాతంత్ర పోరాటం నుంచే తాను స్ఫూర్తిని పొందానని తెలిపారు. 

New Update
prizenobel

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి(nobel-peace-prize) వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో(Maria Corina Machado)కు దక్కిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె గురించి మరిన్ని వివరాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 25 ఏళ్ల క్రితం ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం రేపాయి. ''నా దేశం కుప్పకూలుతుంటే నేను ఇంట్లోనే ఉండి చూడలేను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. బుల్లెట్లకు బదులు బ్యాలెట్లను ఎంచుకుందామని'' అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆమె అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల తరఫున గళం వినిపిస్తూనే ఉన్నారు.  

ఆయన పోరాటమే నాకు స్ఫూర్తి..

మచాదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మహాత్మా గాంధీయే ఆదర్శం అని తెలిపారు. ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం నుంచి తాను ప్రేరణ పొందానని చెప్పారు. శాంతి అంటే బలహీనత కాదని మాత్రమే కాదు మానవత్వం అంటే ఏంటో కూడా గాంధీ ప్రపంచానికి చూపించారు. శాంతిని పొందాలంటే, స్వేచ్ఛను అవసరం..అది కావాలంటే బలం అవసరం అని మచాదో అన్నారు. దాంతో పాటూ భారత దేశాన్ని కూడా ఆమె కొనియాడారు. ఇండియా ఒక గొప్ప ప్రజాస్వామ్యదేశమని..ప్రపంచం అంతా ఇప్పుడు దాని వైపే చూస్తోందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాదో అన్నారు. చాలా దేశాలకు భారత్ ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. నేను భారతదేశాన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తాను అని చెప్పుకొచ్చారు. ఎప్పుడో ఒక రోజు భారత ప్రధాని మోదీని కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అని మచాదో ఆశాభావం వ్యక్తం చేశారు.

వెనెజువెలా 1967 అక్టోబర్‌ 7న మరియా కొరీనా జన్మించారు. ఈమె తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్‌గా పనిచేసేవారు. ఈమె ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఫైనాన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. 1992లో వీధి బాలలు, అనాథ చిన్నారుల కోసం అటెనియా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే సమయంలోనే వెనెజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆమెపై ద్రోహం, కుట్ర కేసులు పెట్టారు. 2014లో వెనెజువెలాలో అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల కొరత, అధ్యక్షుడు నికోలస్ మదురో నేతృత్వంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో పనామాలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న మరియా వెనెజువెలాలో ఉన్న పరిస్థితుల గురించి ప్రసంగం చేశారు. దీంతో అధికారపక్ష నాయకులు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి ప్రభుత్వం ఆమెను బలవంతంగా ఎంపీ పదవి నుంచి బహిష్కరించింది. పలు కేసులు కూడా నమోదయ్యాయి.  

Also Read: MH: మహారాష్ట్ర మహిళా వైద్యురాలి ఆత్మహత్యలో రాజకీయ ఒత్తిడి? సూసైడ్ నోట్‌లో ఎంపీ పేరు..

Advertisment
తాజా కథనాలు