Putin: అమెరికా మా శత్రువు...దాని బెదిరింపులకు లొంగేదేలేదు..పుతిన్

రష్యాలోని రెండు అతి పెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. అమెరికా కండిషన్స్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గమని ఆయన స్పష్టం చేశారు. 

New Update
Putin

Putin

అమెరికాను తాము చాలా గట్టిగా ఎదుర్కొంటామని చెప్పారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టినా...దానికి తమ నుంచి తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు. అమెరికా మాకు అతి పెద్ద శత్రువు...దాని ఆంక్షలకు ఎన్నటికీ తలొగ్గమని అన్నారు. అమెరికా తమ చమురు సంస్థలపై విధించిన ఆంక్షల వలన ఏమీ అవ్వదని...తమ దేశ ఆర్థిక శ్రేయస్సు ఏమీ దెబ్బ తినదని పుతిన్ తెలిపారు. రష్యా ఇంధన రంగంబలంగా ఉందని చెప్పారు. ఈ ఆంక్షలు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే అని నాకు తెలుసని..కానీ ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం, దాని ప్రజలు ఎప్పుడూ ఒత్తిడికి తలొగ్గదని..అలాగే ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోరని స్పష్టం చేశారు. తమ కంపెనీలపై ఆంక్షలు విధిస్తే..ప్రపంచానికే నష్టమని..ఇంధన సమతుల్యత దెబ్బతిని, ధరలు పెరుగుతాయని పుతిన్ చెప్పారు. 

అంతకు రెండింతలు..

మరోవైపు ఉక్రెయిన‌కు అమెరికా తోమహాక్ క్షిపణులు ఇవ్వడంపైనా, అలాగే ఆ దేశం 3,000 కి.మీ. వరకు ఉన్న దేశీయ క్షిపణులతో సహా దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించవచ్చనే వార్తలపైన కూడా పుతిన్ స్పందించారు. నిజంగా ఉక్రెయిన్ అలాంటి ఆయుధాలను ప్రయోగిస్తే తాము చేతులు కట్టుకుని కూర్చోమని పుతిన్ హెచ్చరించారు. అంతకు రెండింతలు ఉక్రెయిన్‌పై దాడి చేస్తామని చెప్పారు. 

రష్యాపై డైరెక్ట్ అటాక్ మొదలెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చర్చలతో టైమ్ వేస్ట్ అన్న ఆయన రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలను విధించారు. మాస్కో యుద్ధ నిధులను అరికట్టడానికి, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకుని రావడం ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా రష్యాలోని అతి పెద్ద చమురు సంస్థలైన రోస్‌నెస్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు ప్రకటించారు. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ప్రకటన జారీ చేసింది. రెండు పెద్ద చమురు సంస్థలు...వాటి అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆంక్షలను అమలు చేయనున్నామని తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు