Stupid Stunt: వెస్ట్ బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంటే మద్దతు ఉండదు..ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్

వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటే అమెరికా మద్దతు పూర్తిగా ఉపసంహరించుకోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తాను అరబ్ దేశాలకు మాటిచ్చానని..అందుకే వాళ్ళు అలా చేయలేరని అన్నారు. 

New Update
trump-netanyahu

Trump-Netanyahu

ఆక్రమిత భూభాగంపై సార్వభౌమాధికారానికి మార్గం సుగమం చేస్తూ జెరూసలేంలోని శాసనసభ్యులు రెండు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఇజ్రాయెల్ ముందుకు సాగితే వాషింగ్టన్ నుండి అన్ని మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. టైమ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఒకవేళ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే... ఆదేశం అమెరికా మద్దతును పూర్తిగా కోల్పోతుందని అన్నారు. అల జరగదనే తాను అనుకుంటున్నానని...ఎందుకంటే అరబ్‌ దేశాలకు నేను మాట ఇచ్చా. ఇప్పుడు అలా చేయలేరు. మనకు ఇప్పుడు అరబ్‌ దేశాలు చాలా మద్దతు ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇజ్రాయెల్‌-అరబ్‌ దేశాల మధ్య సంబంధాలపై మాట్లాడుతూ..  ఈ ఏడాది చివరి నాటికి అబ్రహం ఒప్పందంలో సౌదీ అరేబియా కూడా చేరుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో వారికి ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం, ఇరాన్‌ అణు కార్యక్రమాలు సమస్యగా ఉండేవని, ఇప్పుడు ఆ రెండు ఇబ్బందులూ లేవన్నారు.

ఇజ్రాయెల్ పార్లమెంటలో రెండు బిల్లులు..

మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా దీన్ని ఖండించారు. నేను వ్యక్తిగతంగా దానిని కొంత అవమానంగా భావిస్తున్నాను" అని వాన్స్ అన్నారు. "ట్రంప్ పరిపాలన విధానం ఏమిటంటే వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్‌లో విలీనం చేయకూడదని చెప్పారు. ఇది కనుక రాజకీయ స్టంట్ అయితే ఇంత కంటే తెలివి తక్కువ రాజకీయ స్టంట్ ఉండదని వాన్స్ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో వెస్ట్ బ్యాంక్‌లోని అన్ని స్థావరాలను పూర్తిగా విలీనం చేయాలని ప్రతిపాదించే బిల్లు, పెద్ద స్థావర నగరమైన మాలే అడుమిమ్‌కు సార్వభౌమత్వాన్ని వర్తింపజేసే బిల్లులపై ఇజరాయెల్ పార్లమెంట్‌లో స్వల్ప తేడాతో ఆమోదించబడ్డాయి. 

Also Read: White House: ట్రంప్‌కు వత్తాసు పలికిన వైట్‌హౌస్..రష్యా చమురు కొనుగోళ్ళును భారత్ తగ్గించుకుంటుందని వాదన

Advertisment
తాజా కథనాలు