New York: న్యూ యార్క్‌లో రెండిళ్ళను తగులబెట్టిన దీపావళి బాణాసంచా

న్యూయార్క్‌లోని క్వీన్స్ సౌత్‌ ఓజోన్ సాక్కకలోని దీపావళి బాణాసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో రెండు ఇళ్ళు కాలిపోగా..ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. 

New Update
new york

అమెరికాలో ఎక్కడపడితే అక్కడ బాణాసంచా కాల్చడం నిషేధం. ఇది ఎవరికైనా..అంటే అమెరికన్లు అయినా, భారతీయులు అయినా ఒకటే రూల్. యూఎస్ ఇండిపెండెన్స్‌డే, న్యూయర్‌లకు బాణాసంచా కాలుస్తారు. కానీ సిటీలో ఒకచోట మాత్రమే వాటిని పేలుస్తారు. అక్కడకు జనాలు అందర గేదర్ అవుతారు. పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్‌ కలిసి బాణాసంచాను పేలుస్తారు. మూములు జనాలు మందుగుండును కాల్చిన అవి చిన్న చిన్న కాకపువ్వొత్తులు లాంటి వాటికి పరిమితం అవుతారు. అంతకు మించి ఎవరికీ పర్మిషన్ ఉండదు. ఎందుకంటే అమెరికాలో ఇళ్ళు, ఆఫీసులు, బిల్డింగులు అన్నీ చెక్కవే ఉంటాయి. ఏ మాత్రం చిన్న అగ్గిరవ్వ తగిలినా..వెంటనే మంటలు అంటుకుంటాయి. అందుకే ఇక్కడ అంత జాగ్రత్తలు తీసుకుంటారు. 

అమెరికాలో దీపావళి గురించి అందరికీ తెలుసు. అది ఇండియన్స్‌కు ఫేవరెట్, ముఖ్యమైన పండుగని కూడా తెలుసు. కానీ బాణాసంచాకు మాత్రం పర్మిషన్ మాత్రం ఉండదు. అసలు కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలలో దీపావళికి ఈ ఏడాది గవర్నమెంట్ సెలవు ప్రకటించింది. మిగిలిన స్టేట్స్‌లో అది కూడా లేదు. అలాంటిది బాణాసంచాకు అస్సులు పర్మిషన్ ఉండదు. కేవలం చాలా కొన్ని చోట్ల అంటే టెంపుల్స్ లాంటి ప్రదేశాల్లో మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అఅప్పుడు కూడా పెద్ద పెద్ద బాణాసంచా కాల్చడానికి వీలులేదు. కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు లాంటివి మాత్రమే పేల్చడానికి పర్మిషన్ ఉంటుంది. కానీ ఈ ఏడాది అమెరికాలో దీపావళి రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ లేకుండా బాణాసంచాను కాల్చారు. కొన్నిచోట్ల పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ వచ్చి కూడా క్రాకర్స్‌ను ఆపాల్సి వచ్చింది.

మూడు ఇళ్ళు కాలిపోయాయి..

తాజాగా మూడు రోజులు తర్వాత దీపావళికి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. దీపావళి నాడు కాల్చిన బాణాసంచా కారణంగా న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా రెండు ఇళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ విషం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో లింకన్ స్ట్రీట్‌లోని ఒక ఇంట్లో మంటలు ప్రారంభమై, త్వరగా పొరుగున ఉన్న నివాసానికి వ్యాపించాయి. నిఘా ఫుటేజ్ వీడియోల్లో ఈ విషయం బయటపడింది. ఆ మంటల్లో తాము సర్వం కోల్పోయామని ఒక కుటుంబం తెలిపింది.అలాగే న్యూజెర్సీలో కూడా బాణసంచా కారణంగా ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు