BIG BREAKING: అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..నలుగురు పరిస్థితి విషమం

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

New Update
washington dc

శుక్రవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్శిటీ క్యాంపస్ దగ్గరలో హోమ్‌కమింగ్ వీకెండ్ సందర్భంగా కాల్పులు జరిగాయి. నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. కానీ ఇవి కాస్తా గురి తప్పి నలుగురు వ్యక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. కనీసం నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎవరు చేశారన్న వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు. షూటింగ్ జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం రోడ్లు బ్లాక్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Also Read: Kurnool Bus Accident: లాగితే విడిపోతూ..దయనీయ స్థితిలో మృతదేహాలు..బిడ్డను హత్తుకుని తల్లి ఆహుతి

Advertisment
తాజా కథనాలు