BLA: 14 మంది పాక్ సైనికులు హతం...వీడియో రిలీజ్ చేసిన బలూచ్
భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. అందులో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆ వీడియోను బీఎల్ఏ తాజాగా విడుదల చేసింది.
భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. అందులో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆ వీడియోను బీఎల్ఏ తాజాగా విడుదల చేసింది.
బలూచ్ ప్రజలు వీధుల్లో ఉన్నారని..బెలూచిస్తాన్ ఇక మీదట పాకిస్తాన్ లో భాగం కాదని..మా జాతిని కాపాడ్డానికి తాము బయటకు వచ్చాము అంటూ బలూచ్ నాయకుడు మీర్ యార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అన్ని దేశాలు తమకు మద్దుతునివ్వాలని ఆయన కోరారు.
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారాక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు బంగ్లా తాత్కాలిక సారధి యూనస్. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు.
పాకిస్తాన్ కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని...పార్లమెంటు, జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది.
ఇండియాలో బాయ్‌కాట్ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు.
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఫ్రాన్స్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హాలీవుడ్, బాలీవుడ్ తారలు సందడి చేశారు. రెడ్ కార్పెట్ పై హాలీవడ్ తారల ఫ్యాషన్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూడండి.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ బుద్ధి మరోసారి బయటపడింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ దాడిలో మరణించిన టెర్రరిస్టు మౌలానా మసూద్ కుటుంబానికి భారీ నష్టపరిహారం ప్రకటించింది. ప్రభుత్వ సహాయ నిధి నుంచి రూ.14 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది.
డా. అరవింద్ రచించిన దలైలామా జీవిత చరిత్ర పుస్తకం జులై 9న ఆరంభమయ్యే దలైలామా 90వ జన్మదిన ఉత్సవాల సందర్భంగా విడుదల కానుంది. పుస్తకాన్ని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో విడుదల చేస్తున్నారు. దలైలామా జీవితంలోని అరుదైన విషయాలు, సంఘటనలు ఇందులో ఉండనున్నాయి.