Boycott Turkey: బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు!

ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు. 

New Update
Recep Tayyip Erdoğan

Turkey Recep Tayyip shocking post on Boycott Turkey campaign

ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు. 

Also Read :  రెండు నెలల తర్వాత ఫస్ట్ నైట్.. ఆ రాత్రి భార్య చేసిన పనికి భర్త గుండె గుబేల్!

స్నేహపూర్వక హెచ్చరిక..

ఈ మేరకు.. 'పాకిస్తాన్ ప్రజలకు బహిరంగంగా మా మద్దతు ప్రకటిస్తున్నాం. అయితే ప్రమాదకరమైన ఉద్రిక్తతను తగ్గించడానికి మేం ప్రయత్నించాం. భవిష్యత్తులోనూ ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాం. నా ప్రియమైన సోదరుడు షెహబాజ్‌కు.. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఆస్వాదిస్తున్న తుర్కియే, పాకిస్తాన్ మధ్య సోదరభావం నిజమైన స్నేహానికి బెస్ట్ ఎగ్జాంపుల్.  తుర్కియే, పాకిస్తాన్ శాంతికి మేము చాలా ప్రాధాన్యతనిస్తాం. వివాదాలను పరిష్కరించడంలో చర్చలు, రాజీకి ఒప్పుకున్న పాక్ వివేకవంతమైన తెలివిని అభినందిస్తున్నాం. ఎప్పటిలాగే మంచి, చెడు సమయాల్లో పాక్ కు మద్దతుగా నిలుస్తాం' అంటూ పోస్టులో స్పష్టంగా రాసుకొచ్చారు. 

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

ఏం జరిగిందంటే..
యుద్ధ సమయంలో పాక్ కు టర్కీ మద్దతు ప్రకటించడంతో ఇండియాలో టర్కీ ప్రొడక్ట్స్ బహిష్కరించాలనే డిమాండ్ పెరిగింది.  ఆ దేశ నుంచి దిగుమతి అయ్యే వస్తువులను బహిష్కరించాలని భారతీయులు స్వచ్ఛందంగా క్యాంపెయిన్‌ ప్రారంభించారు. బాయ్‌కాట్‌ టర్కీ అనే స్లోగన్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియా వ్యాపారులు టర్కీ యాపిల్స్‌ కాకుండా ఇతర దేశాల యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు డ్రోన్‌లు సహా ఆయుధ వ్యవస్థలను అందించడంపై టర్కీ దేశంపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉగిపోతున్నారు. ఈ క్రమంలోనే టర్కీ అధ్యక్షుడు సంచలన పోస్ట్ పెట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. 

Also Read :  అతడితో సమంత ఫొటో.. మూవీపై మదర్ వీడియో వైరల్..!

Also Read :  మహిళల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ!

turkey | telugu-news | today telugu news 

#telugu-news #pakistan #india #turkey #today telugu news
Advertisment
Advertisment
తాజా కథనాలు