Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

బలూచ్ ప్రజలు వీధుల్లో ఉన్నారని..బెలూచిస్తాన్ ఇక మీదట పాకిస్తాన్ లో భాగం కాదని..మా జాతిని కాపాడ్డానికి తాము బయటకు వచ్చాము అంటూ బలూచ్ నాయకుడు మీర్ యార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అన్ని దేశాలు తమకు మద్దుతునివ్వాలని ఆయన కోరారు. 

author-image
By Manogna alamuru
New Update
pak

Balochistan

దశాబ్దాల హింస, మానవ హక్కుల ఉల్లంఘన నుంచి విముక్తి పొంది బూలచిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందిందని బలూచ్ నాయకుడు మీర్ యార్ అంటున్నారు. బెలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాక ఆయన సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టును పెట్టారు. బెలూచిస్తాన్ ప్రజలు ఒక జాతీయ నిర్ణయం తీసుకున్నారని...దీనిపై ఇక ప్రపంచం మౌనంగా ఉండకూడదంటూ కోరారు. భారతదేశంతో సహా అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు కోసం ఆయన విజ్ఞప్తి చేశారు.

మామ్మల్ని అంగీకరించండి..

ఎవరు మిమ్మల్ని చంపినా సరే మేము బయటకు వస్తాము. ఎందుకంటే మేము మా జాతిని కాపాడుకోవాలి. దయచేసి మాకు మద్దుతునివ్వండి. పాకిస్తాన్ ఆక్రమిత బెలూచిస్తాన్ లో బలూచ్ ప్రజలు వీధుల్లో ఉన్నారు. బలూచిస్తాన్ ఇకపై పాకిస్తాన్‌లో భాగం కాదని...ప్రపంచం దీనిపై ఇక మౌనంగా ఉండకూడదని...తమకు మద్దతు ఇవ్వాలని మీర్ యార్ కోరారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బలూచ్ ప్రజలను ఇక మీదట పాకిస్తానీయుల కింద గుర్తించకూడదని ఆయన కోరారు. పాకిస్తాన్ తప్పుడు వాదనలను వినొద్దని మీర్ విజ్ఞప్తి చేశారు. బలూచిస్తాన్‌ను బలవంతంగా  విదేశీ శక్తుల సహకారంతో పాకిస్తాన్‌లో విలీనం చేశారని ఆయన అన్నారు. దశాబ్దాలుగా ఇక్కడ అదృశ్యాలు, నకిలీ ఎన్ కౌంటర్లు లాంటి ఘోరాలకు పాల్పడ్డారని...దీనికి కారణం పాకిస్తాన్ భద్రతా దళాలు, స్థానిక సాయుధ గ్రూపులు రెండూ కారణమని ఆరోపించారు. దీని వలన సాధారణ పౌరులు నరకం అనుభవించారని చెప్పుకొచ్చారు. 

పీవోకే కు పూర్తి మద్దతు...

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయాలనే భారత డిమాండ్ కు బలూచ్ నాయకుడు మీర్ యార్ పూర్తి మద్దతు పలికారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని పాకిస్తాన్ పై అంతర్జాతీయ సమాజ్ వత్తిడి తీసుకురావాలని కోరారు. భారతదేశ నిర్ణయాన్ని బలూచిస్తాన్ పూర్తిగా సమర్థిస్తుందని మీర్ యార్ అన్నారు. పీఓకే ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని మీర్ యార్ అన్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించగల సామర్థ్యం భారత్ కు ఉందని ఆయన అన్నారు.

today-latest-news-in-telugu | pakistan 

Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు