/rtv/media/media_files/2025/05/14/lt0YwUcgasHjxMIgeiW4.jpg)
Sindu water treaty pak letter to india
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సున్నితమైన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సృష్టిస్తుందని పాక్ భారత్ కు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం సైతం పాక్ లేఖ రాసిన విషయాన్ని ధ్రువీకరించింది.
Also Read : హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!
Also Read : మోనాలిసాతో ఫొటో కోసం ఎగబడ్డ కెమెరామాన్ - వీడియో చూశారా?
పాక్ రిక్వెస్ట్ కు భారత్ నో..
అయితే.. పాక్ విజ్ఞప్తిని మోదీ సర్కార్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ఇటీవల ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ పౌరులందరినీ ఆ దేశానికి తిప్పి పంపింది. ఇందుకు సంబంధించిన అన్ని రాకాల వీసాలను రద్దు చేసింది.
Also Read : Operation karregutta: NAXAL FREE KARREGUTTA.. డీజీపీ సంచలన ప్రెస్ మీట్!
పాక్ నుంచి ఎగుమతులు, దిగుమతులను సైతం నిషేధించింది. ఐఎంఎఫ్ నుంచి కూడా పాక్ కు అప్పు పుట్టకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతపై ఇటీవల ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా సైతం స్పందించారు. ఇందులో తాము ఎలాంటి జోక్యం చేసుకోవట్లేదని స్పష్టం చేశారు. ప్రపంచబ్యాక్ పాత్ర ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ కు అన్ని దారులు ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలోనే లేఖ రాసి భారత్ తో కాల్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : ఫైనల్ ఆపరేషన్.. డ్రోన్లు, రాకెట్లతో కర్రెగుట్ట ఖతం!
(telugu breaking news | telugu-news )
Follow Us