/rtv/media/media_files/2025/05/14/GZNXe1h6vPWXrPp7KJAD.jpg)
Pakistan govt Compensation for Maulana Masood
IND-PAK WAR: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ బుద్ధి మరోసారి బయటపడింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ దాడిలో మరణించిన టెర్రరిస్టు మౌలానా మసూద్ కుటుంబానికి భారీ నష్టపరిహారం ప్రకటించింది. ప్రభుత్వ సహాయ నిధి నుంచి రూ.14 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు - భారత వైమానిక దాడుల్లో ధ్వంసమైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను పునర్నిర్మిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం దారుణం.
Also Read : ‘అత్తా మీ కూతుర్ని చంపేశా’.. HYDలో భార్య గొంతు నులిమి, గాజుతో కోసి కిరాతకంగా చంపిన భర్త!
ప్రతి పౌరుడి కుటుంబానికి..
ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ పై డబ్బుల వర్షం కురిపించబోతోంది. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ అధినేత మసూద్ అజార్‌కు పాకిస్తాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం ప్రభుత్వ సహాయ నిధి నుంచి మొత్తం రూ.14 కోట్లు ఇవ్వబోతోంది. భారత దాడుల్లో మరణించిన ప్రతి పౌరుడి కుటుంబానికి పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం రూ. 1 కోటి (10 మిలియన్ PKR) పరిహారం ఇస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనతో ఇది వెలుగులోకి వచ్చింది.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
ఈ 14 మందికి..
పహాల్గాం దాడికి ప్రతికారంగా 2025 మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాకిస్తాన్, పీఓకేలలో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. బహల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై కూడా క్షిపణులతో దాడి చేసింది. జైషే ఉగ్రవాద శిబిరాన్ని కూల్చివేయగా అందులోవున్న మసూద్ అజార్ సోదరి, బావమరిది సహా 14 మంది మరణించారు. మృతుల్లో తన అక్క, బావమరిది, మేనల్లుడు, భార్య, మేనకోడలు, అతని కుటుంబంలోని ఐదుగురు పిల్లలు ఉన్నారని ఉగ్రవాది మసూద్ అజార్ స్వయంగా వెల్లడించాడు.
* భారత దాడుల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు రూ.1 కోటి నుంచి రూ.1.8 కోట్ల వరకు.
* గాయపడిన పౌరులకు రూ. 10- నుంచి 20 లక్షలు.
* రూ.1.9 కోట్ల నుండి రూ.4.2 కోట్ల వరకు గృహనిర్మాణ సహాయం.
* మరణించిన సైనికుల కుటుంబాలకు ఆ సైనికుల పదవీ విరమణ తేదీ వరకు పూర్తి జీతం.
* ప్రాణాలు కోల్పోయిన సైనికుల పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య.
* సైనికుడి కుమార్తె వివాహానికి రూ. 10 లక్షలు.
* గాయపడిన సైనికులకు రూ. 20 నుంచి -50 లక్షలు.
* భారత దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ళు, మసీదుల పునర్నిర్మాణం.
Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!
చికిత్స ఖర్చు ప్రభుత్వమే..
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. 'అమరవీరుల పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత. మేము ఈ బాధ్యతను నెరవేరుస్తాం. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చులన్నింటినీ మా ప్రభుత్వమే భరిస్తుంది. పాకిస్తాన్ రక్షణ, గౌరవానికి దోహదపడే ఎవరినైనా జాతీయ స్థాయిలో గుర్తించి గౌరవిస్తామని షరీఫ్ హామీ ఇచ్చారు.
Also Read : హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!
pakistan | compensation | terrorist | telugu-news | today telugu news