Champions Trophy 2025: ఛాంపియన్లకు ‘వైట్ జాకెట్’.. ఇంత ప్రాధాన్యత ఉందా?

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారతప్లేయర్లు వైట్‌బ్లేజర్లు ధరించడం వెనుకొక ప్రాధాన్యత ఉంది. ప్లేయర్ల గొప్పతనం, ధృడసంకల్పాన్ని తెలిపే ‘గౌరవ బ్యాడ్జ్’ లాంటిదని ICC పేర్కొంది. ట్రోఫీకోసం పడ్డకృషి, తరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింభిస్తాయని తెలిపింది.

New Update
Why India Players Are Wearing White Blazers During Champions Trophy 2025 Presentation

Why India Players Are Wearing White Blazers During Champions Trophy 2025 Presentation

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలిచింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా జట్టు 9 నెలల్లోనే రెండవ ట్రోఫీని దక్కించుకుంది. 2024 T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది భారత్. 

ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ

కాగా ఆదివారం మ్యాచ్‌‌ గెలిచిన అనంతరం క్రికెట్ ప్రియులంతా ఒక విషయం గమనించే ఉంటారు. టీమిండియా ప్లేయర్స్ అందరూ ఒక యూనిఫాంలా.. వైట్ సూట్ ధరించి వేదికపైకి వచ్చారు. దీంతో అందరిలోనూ ఒకింత ఆసక్తి మొదలైంది. ఇలా ఎందుకు వేసుకుని వచ్చారో అని తెగ సెర్చ్ చేసేశారు. 

2009 నుండి మొదలు

అయితే ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత వైట్ సూట్ ధరించి రావడం ఇదేమి తొలిసారి కాదు. 2009 నుండి విజేత జట్టులోని ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తెల్లటి బ్లేజర్‌లను ధరించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఈ టోర్నీని దక్షిణాఫ్రికాలో ఆడగా.. ఆస్ట్రేలియా జట్టు గెలిచి వైట్ బ్లేజర్లను ధరించింది. 

Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే

ఆ తర్వాత ధోనీ సారధ్యంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా ఇలానే వైట్ బ్లేజర్స్ ధరించి వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత 2017లో ఇలానే జరిగింది. మళ్లీ అదే సాంప్రదాయాన్ని 2025లో కూడా ఐసీసీ నిర్వహించింది. అయితే ఈ సాంప్రదాయం కేవలం ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే కనిపిస్తుంది. వన్డే, టీ-20 ప్రపంచ కప్ లలో ఇలాంటిది కనిపించదు. 

కారణం ఇదే

అయితే ఇలా వైట్ బ్లేజర్లు ధరించడానికి ఓ ప్రాముఖ్యత ఉంది. వైట్ షూట్.. ప్లేయర్ల గొప్పతనం, ధృడ సంకల్పాన్ని తెలిపే ఒక ‘గౌరవ బ్యాడ్జ్’ లాంటిదని ఐసీసీ తెలిపింది. జట్లు ట్రోఫీ కోసమే కాకుండా.. తెల్ల కోట్ కోసం కూడా పోటీ పడతాయని పేర్కొంది. ఈ వైట్ షూట్ ఛాంపియన్లు ధరించే గౌరవ చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే.. ఈ ట్రోఫీకోసం వారు పడ్డ కృషి.. తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింభిస్తాయని ఐసీసీ తెలిపింది. మిగిలిన టీమ్‌లు కూడా మరోసారి పోటీ పడేలా ఇది ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు