/rtv/media/media_files/2026/02/03/putin-2026-02-03-13-07-18.jpg)
Putin, Modi and Trump
భారత్‌పై 18 శాతానికి టారిఫ్(Tariffs)ను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీటిని సున్నా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు భారత్ ఒప్పకున్నట్లు వెల్లడించారు. అయితే సుంకాల తగ్గింపుపై స్పందించిన ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. భారత్ భారీ స్థాయిలో అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని ట్రంప్ పేర్కొన్న దానిపై కూడా స్పందించలేదు.
Also Read: మందుబాబులకు గుడ్‌న్యూస్.. తాగిపడిపోతే ఆ సేవలు
India Russia Silent On Trump Oil Buying Statement
ఇదిలాఉండగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంలో ట్రంప్ చాలాసార్లు ఈ ప్రకటనలు చేశారు. గతంలో కూడా ఇలా బహిరంగంగా ప్రకటించారు. దీన్ని భారత్ కూడా చాలాసార్లు ఖండించింది. జాతి ప్రయోజనాల మేరకే తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈసారి కూడా కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇది వ్యూహాత్మక మౌనమని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా, రష్యాతో సంబంధాలు ఉండటం వల్లే ఇలా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు టారిఫ్‌లు 50 నుంచి 18 శాతానికి తగ్గాయా లేదా 25 నుంచి 18 శాతానికి తగ్గాయా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: ఈయూ ప్రతినిధి సంచలన ప్రకటన.. యూరప్ సైన్యం ఏర్పాటు ప్రమాదకరమని హెచ్చరిక
మరోవైపు రష్యా(russia) కూడా ఈ ప్రకటనపై స్పందించలేదు. కానీ గతంలో మాత్రం భారత్ చమరు కొనుగోలు నిర్ణయంపై తమ చమురు మార్కెట్‌పై ప్రభావం ఉంటుందని సూచించింది. భారత్ తమకు మిత్ర దేశమని.. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గే ఛాన్స్ ఉండదని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ భారత్.. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తే రష్యా ఆసియా మార్కెట్‌లో తమ స్థానం కోల్పోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు.
Follow Us