/rtv/media/media_files/2026/02/02/eu-foreign-policy-chief-kaja-kallas-2026-02-02-20-28-02.jpg)
EU foreign policy chief Kaja Kallas
గ్రీన్‌లాండ్ వ్యవహారంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నారు. కానీ ఐరోపా దేశాలు మాత్రం ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. డెన్మార్క్‌కు కూడా గ్రీన్‌లాండ్‌ను ఎవరికి అప్పగించేది లేదంటూ స్పష్టం చేసింది. దీనిపై అమెరికా, ఐరోపా దేశాల మధ్య విభేదాలు తలెత్తడంతో తాజాగా యురోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశం చర్చనీయమవుతోంది. దీనిపై స్పందించిన EU ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్ సైన్యం ఏర్పాటు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.
Also Read: యోగి ఆధిత్యనాథ్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు బ్రేక్
యూరప్ సైన్యం కావాలని చెప్పేవారు ఈ విషయం గురించి ప్రాక్టికల్‌గా ఆలోచించి ఉండరని అన్నారు. యూరప్ దేశాలు నాటో ఉన్న కారణంగా మళ్లీ ఒక ప్రత్యేక సైన్యాన్ని సృష్టించలేరని తెలిపారు. యుద్ధం లాంటి సంక్షోభ సమయాల్లో ఎవరు ఎవరికి ఆదేశాలు జారీ చేస్తారనేది కీలకమైన అంశమన్నారు. ఒకవేళ నాటో, యూరప్ సైన్యం రెండూ ఉన్నట్లయితే పరిస్థితులు గందరగోళంగా మారుతాయన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
Also Read: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రేవంత్ సర్కార్ భారీ సాయం..
ఇదిలాఉండగా నార్వే ప్రధాని జోనాస్ కూడా యురోపియన్ ఆర్మీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. నాటోనే సంక్లిష్టమైనదని అయినప్పటికీ పనిచేయగలదని పేర్కొన్నారు. మరోవైపు నాటో చీఫ్ మార్క్ రుట్టే కూడా దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా సపోర్ట్ లేకుంటే ఐరోపాకు రక్షణే లేదని అన్నారు.
Follow Us