/rtv/media/media_files/2025/11/07/wine-shops-2025-11-07-08-06-19.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ కానున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాలతో పాటుగా బార్లపై నాలుగు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. 14న ఫలితాల లెక్కింపు ఉండటంతో ఆ రోజుకూడా వైన్స్ బంద్ విధించారు.
Also Read : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ జిల్లాల్లోనే..!
అవినాష్ మోహంతీ ఆదేశాలు
ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 135-C ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయని కమిషనర్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం నిషేధం ఎన్నికల ప్రలోభాలను అడ్డుకోవడమే కాకుండా, పోలింగ్ రోజున చట్టం, శాంతిభద్రతలు కాపాడడానికీ కీలకమని అవినాష్ మోహంతీ చెప్పారు. ఎన్నికల రోజు తరచుగా మద్యం ప్రభావంతో వివాదాలు, గొడవలు జరుగుతుంటాయి. ఈ కారణంగా నాలుగు రోజులపాటు మద్యం విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేయడం అనివార్యమైందన్నారు.
జూబ్లీహిల్స్ఉప ఎన్నికకు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైంది. ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరుగుతోంది.నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్య ఉంది. ప్రస్తుతం ప్రచారం అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా ఇతర సీనియర్ నాయకులందరూ నియోజకవర్గంలో రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు డబ్బు పంపిణీ ఆరోపణలు చేసుకుంటూ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు.
Also Read : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్... 60 స్పెషల్ రైళ్లు.. ఇవాళ్టి నుంచే రిజర్వేషన్ !
Follow Us