/rtv/media/media_files/2025/11/07/mp-kalyan-banerjee-loses-rs-56-lakh-after-scammers-break-into-bank-account-2025-11-07-19-50-30.jpg)
MP Kalyan Banerjee loses Rs 56 lakh after scammers break into bank account
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఎంపీకే బురిడి కొట్టించారు. ఆయన అకౌంట్‌లో నుంచి ఏకంగా రూ.56 లక్షలు కాజేశారు. ఫేక్ కేవైసీతో ఈ మోసానికి పాల్పడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి కోల్‌కతాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో అకౌంట్ ఉంది. ఈ ఖాతాకు సంబంధించి కేవైసీని అప్‌డేట్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఫేక్ పాన్, ఆధార్ కార్డులను వాడారు.
Also Read: అంతరిక్షంలో అద్భుతం.. స్పేస్ స్టేషన్‌లో వంట చేసిన వ్యోమగాములు
ఆయన అకౌంట్‌కు లింక్ అయ్యి ఉ్నన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చేశారు. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో లావాదేవీలు చేశారు. మొత్తంగా రూ.56 లక్షలు కాజేసి వాటిని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఆ డబ్బుతో వాళ్లు బంగారం కూడా కొన్నట్లు తెలుస్తోంది. కొంత నగదును ATMల నుంచి విత్‌డ్రా చేసుకున్నట్లు సమాచారం. అయితే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఖాతా గత కొంతకాలంగా యాక్టివ్‌గా లేదు.
Also Read: ‘రేసుగుర్రం నటుడిని చంపేస్తాం’.. గ్యాంగ్‌స్టర్ మాస్ వార్నింగ్..!
అయితే కల్యాణ్ బెనర్జీ 2001 నుంచి 2006 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ అకౌంట్‌ను ఓపెన్ చేశారని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తనకు వచ్చే వేతనం అందులోనే క్రిడెట్ అయినట్లు తెలుస్తోంది. యాక్టివ్‌గా లేని ఆ ఖాతాలో ఇటీవల కార్యక్రమాలు ప్రారంభం కాగా.. ఎంపీ దీన్ని గుర్తించారు. బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. అయితే ఎంపీకి కూడా సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి రూ.56 లక్షలు కాజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: టెస్లాలో మస్క్ కు వన్ ట్రిలియన్ ప్యాకేజ్..ఆనందంతో రోబోతో ఎలాన్ డాన్స్
Follow Us