Nepal-PM Modi: నేపాల్ ఘర్షణలపై స్పందించిన ప్రధాని మోదీ

ప్రస్తుతం నేపాల్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ భారత ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై ఎక్స్‌లో స్పందించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై కేబినేట్ కమిటీ చర్చలు జరిపిందని పేర్కొన్నారు. నేపాలీ ప్రజలు శాంతికి మద్దతివ్వాలని కోరుతున్నానని'' ఆయన పిలుపునిచ్చారు.

New Update
PM Modi reacts to heart-rending violence in Nepal

PM Modi reacts to heart-rending violence in Nepal

నేపాల్‌(Nepal) లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ప్రధానితో పాటు పలువురి మంత్రుల ఇళ్లను తగలబెట్టారు. ఇప్పటికే ప్రధాని కేపీ శర్మ ఒలీ(kp-sharma-oli) తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నేపాల్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ భారత ప్రధాని మోదీ(PM Modi) ఈ వ్యవహారంపై ఎక్స్‌లో స్పందించారు. '' నేపాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు విషాదకరం. చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై కేబినేట్ కమిటీ చర్చలు జరిపింది. నేపాల్‌లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు ముఖ్యం. నేపాలీ సోదర, సోదరీమణులు శాంతికి మద్దతివ్వాలని కోరుతున్నానని'' ఆయన పిలుపునిచ్చారు. 

PM Modi Reacts On Nepal Violence

Also Read: భారత్ తో సుంకాలపై చర్చలు.. మోదీతో కూడా మాట్లాడతా అంటున్న ట్రంప్..

Advertisment
తాజా కథనాలు