/rtv/media/media_files/2025/03/12/BDGXjsMz9ngTU1pHX8uy.jpg)
Trump Buys Telsa
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా కారు (Tesla Car) కొన్నారు. అంతేకాదు దాని ఓనర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ను పక్కన కూర్చో పెట్టుకుని డ్రైవింగ్ కూడా చేశారు. మరోవైపు ట్రంప్ కోసం మస్క్ ఏకంగా ఐదు కార్లను వైట్ హౌస్ కు తీసుకుని వచ్చారు. అందులో ఒక రెడ్ కలర్ టెస్లా కారును ట్రంప్ కొన్నారు. కారు చాలా అందంగా ఉందని ట్రంప్ ప్రశంసించారు. మార్కెట్ ధరకే టెస్లా కార్ ను ట్రంప్ కొన్నారు. ఎలాన్ మస్క్ డిస్కౌంట్ ఇస్తానన్నా వద్దని చెప్పారు. ట్రంప్ టెస్లా కార్ కొనుగోలుతో ఆ కార్ మార్కెట్ భారీగా పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కొనుగోలుతో దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.
Also Read : పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది: షాహిద్ అఫ్రిది
మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..
ట్రంప్ (Trump) ప్రభుత్వంలోని డోజ్ ను ఎలాన్ మస్క్ కు అప్పగించారు. మస్క్ నేతృత్వంలో డోజ్ శాఖ నిర్ణయాల వల్ల అమెరికాలో ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. డోజ్ తీసుకున్న నిర్ణయాల వలన చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దాంతో మస్క్ కంపెనీలు అయిన టెస్లా, ఎక్స్ లాంటి వాటి మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అలాగే టెస్లా కారును బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎలాన్ మస్క్ కు మద్దుతుగా నిలిచారు. తానే స్వయంగా టెస్లా కార్ ను కొంటానని చెప్పారు. అన్నట్లుగానే ఈరోజు కారును కొన్నారు.
Also Read : చిత్తూరు లో దొంగల బీభత్సం...ఇంట్లో దూరి కాల్పులు!
President @realDonaldTrump and @elonmusk hop in a Tesla! pic.twitter.com/NRRm7IEQGf
— Margo Martin (@MargoMartin47) March 11, 2025
Also Read: USA: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు
Also Read : రాజమండ్రిలో లొంగిపోయిన బోరుగడ్డ..
Follow Us