US Embassy Warning: అలా చేస్తే వీసాలు క్యాన్సిల్..యూఎస్ ఎంబసీ వార్నింగ్

అమెరికాలో దాడి, దొంగతనం లేదా దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలతో పాటూ వీసాను రద్దు చేస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్‌లో ఒక భారతీయ మహిళ దొంగతనం పట్టుబడిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేసింది. 

New Update
target

US Embassy Warning

US Embassy Warning: 

అమెరికాలో దొంగతనాలు, దాడులు, దోపిడీలు చేస్తే ఊరుకునేది లేదని అంటోంది యూఎస్ ఎంబసీ. వీటికి పాల్పడితే న్యాయపరమైన శిక్షలే కాదు వీసా కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దాంతో పాటూ మరోసారి అమెరికా రావడానికి వీలు లేకుండా డిటెన్షన్ ను కూడా విధిస్తామని తెలిపింది. అమెరికాలో శాంతి భద్రతలకు అత్యంత విలువ ఇస్తామని...విదేశీయులు కూడా ఇక్కడ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ఈ మొత్తం వివరాలు పొందుపరుస్తూ యూఎస్ ఎంబసీ ఒక పోస్ట్ ను పెట్టింది. 

Also Read: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

Also Read: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

ఇప్పుడెందుకు ఈ హెచ్చరిక..

ఇల్లినాయిస్ స్టేట్ లో భారతీయురాలు ఒకామె స్థానికంగా ఉన్న టార్గెట్ సోర్ట్ కు వెళ్ళి 7 గంటలు గడిపింది. దాదాపు రూ.11 లక్షల విలువైన వస్తువులను తన కార్ట్ లో వేసుకుంది. తర్వాత ఆ స్టోర్ కు ఉన్న పశ్చిమ గేట్ నుంచి డబ్బులు చెల్లించకుండా వెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే అనుమానం వచ్చిన స్టోర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పారిపోదామని ప్రయత్నించిన భారతీయురాలిని పట్టుకున్నారు. ఈమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఆమె వారితో వాదించింది. తానేమీ చేయలేదని..ఇంత చిన్న దానికే అరెస్ట్ చేస్తారా అంటూ మాట్లాడింది. ఇవన్నీ వీడియోలో ఉన్నాయి. దీంతో అది కాస్తా వైరల్ అయింది. భారతీయురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటూ యూఎస్ ఎంబసీ వార్నింగ్ కూడా ఇచ్చింది. 

Also Read:  తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

Advertisment
తాజా కథనాలు