/rtv/media/media_files/2025/04/19/PxMhbWIVRFx0F0H0AlIi.jpg)
devotees stopped wedding in andhra pradesh kakinada
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. దానిని మనసారా.. తనివితీరా అనుభూతి చెందాలని చాలా మందికి ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా తన భర్త లేదా భార్య కోసం ఎన్నెన్నో కలలు కంటుంటారు.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
ఇలాంటి అమ్మాయి లేదా ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అందంగా ఉండాలి.. మంచిగా నవ్వుతూ మాట్లాడాలి.. ఈడూ జోడు కుదరాలి. తమను చూసేవారు ముచ్చటైన జంట అని మురిసిపోవాలి అంటూ చాలా మంది కలలు కంటుంటారు. కానీ కొన్ని సార్లు వారి ఆశలు, కోరికలు ఆవిరైపోతాయి. వారు కోరుకున్న క్వాలిటీస్ ఉన్నవారు దొరకక.. పేరెంట్స్ కోసం అడ్జస్ట్ కావాల్సి వస్తుంది.
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో
తాజాగా అలాంటి ఎన్నో ఆశలు పెట్టుకున్న 22 ఏళ్ల యువతికి తమ పేరెంట్స్ 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. దీంతో ఆ యువతి ఆవేదనకు అంతులేకుండా పోయింది. గుండెల నిండా బాధతో పెళ్లి పీటలపైనే కన్నీరు కార్చింది. అది చూసిన భక్తులు ఆ పెళ్లిని పెటాకులు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉన్న అన్నవరం దేవస్థానంలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణంలోని పెళ్లి పీటలపై 22 ఏళ్ల యువతి, 42 ఏళ్ల వ్యక్తితో కూర్చుంది. అంతా సందడి సందడిగా జరుగుతుంది. కానీ పెళ్లి పీటలపై ఉన్న యువతి మాత్రం భాదతో కన్నీరు కారుస్తూ ఉంది. అది గమనించిన స్థానిక భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
ఆపై ఆ యువతికి ఈ పెళ్లి ఇష్టం ఉందా? లేక ఆమెకు ఇష్టం లేకుండా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ యువతి రియాక్ట్ అయింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనలోని భాదను వారితో పంచుకుంది. దీంతో ఆ పెళ్లి వేడుకను భక్తులు, సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.
andhra-pradesh | latest-telugu-news | telugu-news | crime news