/rtv/media/media_files/2025/04/19/EgVYiP5t6jOYfocUlqSr.jpg)
US Visa, Passport
వీసా నిబంధనలలో అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ పెద్ద మార్పు చేసింది. గాజా స్ట్రిప్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2007 తర్వాత గాజా స్ట్రిప్‌ను సందర్శించిన ఏ విదేశీయుడికి అయినా వీసా రద్దు అవుతుంది . వీసా దరఖాస్తు సమయంలో ఆ వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలను, పాస్ట్ పోర్ట్ లను తనిఖీ చేస్తారు. ఇందులో అతను గాజా వెళ్ళినట్టు ఉంటే ..వారికి వీసాను క్యాన్సిల్ చేస్తారు. దీనికి సంబంధించి విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియో ఆదేశాలను జారీ చేశారు. ఈ నియయం వలసదారులకు, అమెరికన్లకు కూడా వర్తిస్తుందని చెప్పారు. ఇందులో విద్యార్థి వీసాలు, పర్యాటక వీసాలు, దౌత్య సందర్శనలు కూడా ఉన్నాయి. అంతేకాదు గాజాలో పని చేసిన ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవకులకు కూడా ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.
భద్రత కోసమే ఇదంతా..
గాజా నుంచి తిరిగి వచ్చిన వారి వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ అంటోంది. అలాంటి వాటిని అరికట్టడానికే ఇంత కఠినమైన చర్యలను తీసుకున్నామని చెబుతోంది. ఒక వ్యక్తి సోషల్ మీడియా లేదా డిజిటల్ కార్యకలాపాల్లో ఏదైనా కంటెంట్ కనుగొనబడితే, అది అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించబడితే, అతని వీసా దరఖాస్తును ఇంటర్-ఏజెన్సీ సమీక్ష కోసం పంపుతారు. అక్కడ వెరిఫికేషన్ లో తేడా కనిపిస్తే వెంటనే వారి వీసాలను రద్దు చేస్తారు. 2025 ప్రారంభం నుండి మేము 300 కి పైగా వీసాలను రద్దు చేశామని మార్గ రూబియో తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విదేశీ విద్యార్థులు అమెరికాలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికే వారి వీసాలు క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ను విమర్శిస్తే దానికి సహాయం చేస్తున్న అమెరికాను కూడా విమర్శించినట్టేనని యూఎస్ ప్రభుత్వం చెబుతోంది.
హార్వర్డ్ యూనివర్శిటీయే ప్రధాన లక్ష్యం...
ఇప్పటికే అమెరికాలోని హార్వర్ట్ యూనివర్శిటీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ వీసాల క్యాన్సిలేషన్ కూడా అందులోని భాగమే అని అంటున్నారు. గాజా వివాదం తర్వాత హార్వర్డ్‌లో జరిగిన నిరసనల ఆధారంగా.. విశ్వవిద్యాలయంలో విధాన మార్పులు చేయాలని యూఎస్ గవర్నమెంట్ ఇప్పటికే డిమాండ్ చేసింది. అందులో అమెరికా విలువలకు ఏ విద్యార్థి అయినా వ్యతిరేకంగా ఉంటే వారిని క్యాంపస్ నుంచి తొలగించాలని చెప్పింది. దాంతో పాటూ యూదు వ్యతిరేక కార్యకలాపాలను నిమంత్రించాలని కోరింది. వీటిని హార్వర్డ్ యూనివర్శిటీ తిరస్కరించింది. అందుకు ప్రతిగా 2బిలియన్ల డాలర్ల సమాఖ్య నిధులను ప్రభుత్వం ఆపేసింది. హార్వర్డ్ ఇకపై అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి అర్హత లేదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం చెప్పింది. ఇప్పుడు దానికి తోడు ఈ కొత్త వీసా నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. యూఎస్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్శిటీ పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఇది కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛ ఉల్లంఘన అని అంటున్నారు. ఈ విధానం అమెరికా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు విశ్వసిస్తున్నారు.
today-latest-news-in-telugu | usa | visa | passport | gaza | Social Media
Also Read: MP:ఆఫ్రికా నుంచి మరో 8 చీతాలు భారత్ కు..