/rtv/media/media_files/2025/08/17/ukrainian-sniper-2025-08-17-16-13-04.jpg)
Ukrainian sniper breaks world record with 13,000 foot kill shot against Russian forces
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరుదేశాల నుంచి చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ స్నైపర్ యూనిట్ సైకికుడు ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఏకంగా 13 వేల అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రష్యా సైనికులను కాల్చి చంపాడు. ఈ విషయాన్ని కీవ్‌పోస్ట్ పత్రిక వెల్లడించింది. అన్ని వేల అడుగుల దూరం నుంచి గురి తప్పకుండా శత్రువులను కాల్చడం ఓ ప్రపంచ రికార్డని పేర్కొంది.
Also Read: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ
ఉక్రెయిన్ సైనికుడు స్థానికంగా తయారుచేసిన ఎలిగేటర్ 14.5 ఎంఎం రైఫిల్‌తో పొక్రొవొస్క్ ప్రాంతంలో ఇద్దరు రష్యా సైనికులను కాల్చిచంపినట్లు తెలిపింది. దీనికి అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ సాయం కూడా తీసుకున్నట్లు పేర్కొంది. ఆగస్టు 14న ఆ సైనికుడు ఈ రికార్డు సాధించినట్లు చెప్పింది. అయితే అలాస్కాలో పుతిన్-ట్రంప్ సమావేశం కావడానికి ఒకరోజు ముందు ఈ రికార్డు సృష్టించడం విశేషం.
Ukrainian sniper breaks world record with 13,000-foot kill shot against Russian forces: report https://t.co/p6RCDvgEbopic.twitter.com/lby1aisZ02
— New York Post (@nypost) August 17, 2025
Also Read: రష్యా- ఉక్రెయిన్ వార్.. ట్రంప్ పరువు తీసేసిన పుతిన్
ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో పొక్రొవోస్క్ అనే ప్రాంతంపై రష్యా ఎక్కువగా దాడులు చేస్తోంది. ఈ పట్టణంలో దాదాపు 60 వేల మంది ప్రజలు ఉంటున్నారు. మరో విషయం ఏంటంటే గతంలో అత్యధిక దూరంలో టార్గెట్‌ను ఛేదించిన రికార్డు కూడా 58 ఏళ్ల ఉక్రెయిన్ స్నైపర్ పేరుమీదే ఉంది. ఆ సైనికుడు 12,400 అడుగుల దూరంలో ఉన్న రష్యా సైనికుడిని కాల్చి చంపాడు.
Also Read: అలస్కా చర్చల్లో విజేత పుతిన్..ప్రపంచ నాయకుడిగా నిరూపణ
ఇదిలాఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలస్కా వేదికగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే యుద్ధం ముగించేందుకు పుతిన్ కీలక డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపేయాలంటే దొనెట్‌స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ వైదొలగాలన్నారు. ఈ విషయాన్ని ట్రంప్.. జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ నేతలకు చెప్పారు. జెలెన్‌స్కీ పుతిన్ డిమాండ్‌ను తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు సోమవారం వాషింగ్టన్‌లో జెలెన్‌స్కీ, ట్రంప్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలమైతే మళ్లీ పుతిన్‌తో కూడా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే పుతిన్ డిమాండ్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించడంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది.
Also Read: లెస్ రిస్క్.. మోర్ సోవింగ్.. 60 ఏళ్ల మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఇవే!