/rtv/media/media_files/2025/08/17/scheme-2025-08-17-15-21-26.jpg)
Scheme
వయస్సు పెరిగిన తర్వాత కూడా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుండాలి. అయితే కొందరికి ఉన్న ఆర్థిక సమస్యల వల్ల ముందుగా ఇలాంటి స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేరు. వయస్సు పెరిగిన తర్వాత ఎంతో కొంత సేవ్ చేయాలని అనుకుంటారు. దీనివల్ల వయస్సు మీరిన తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈ వయస్సులో ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా ఉండవచ్చు. కొందరి దగ్గర డబ్బు ఉన్నా ఇన్వెస్ట్ చేయలేరు. ఎందుకంటే వారికి స్కీమ్స్ కోసం పెద్దగా తెలియదు. దీనివల్ల డబ్బులు సేవింగ్స్ చేయలేక, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికి సేవింగ్ స్కీమ్స్ బాగా ఉపయోగపడతాయి. అయితే 60 ఏళ్లు దాటిన మహిళలు స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ ఏవో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Microsoft Layoffs : మైక్రోసాఫ్ట్ లో 15,000 ఉద్యోగులు ఔట్
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
60 ఏళ్లు దాటిన మహిళలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అసలు రిస్క్ ఉండదు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది. అయితే ఇందులో గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఐదేళ్ల మెచ్యూరిటీ అయిన తర్వాత మళ్లీ ఐదేళ్లపాటు పెంచుకోవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుతో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది. మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
Secure your golden years with the Senior Citizens Savings Scheme (SCSS) from India Post.
— India Post (@IndiaPostOffice) July 29, 2025
✔️ 8.2% interest per annum, paid quarterly
✔️ Minimum deposit: ₹1,000
✔️ Eligible for tax benefits under Section 80C of the Income Tax Act
Enjoy steady returns and peace of mind with one… pic.twitter.com/pp0kzLAXd9
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్
వయస్సు పెరిగిన తర్వాత కొందరికి నెలవారీ ఆదాయం కావాలనిపిస్తుంది. అలాంటి వారికి ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల డబ్బులు వస్తాయి. ప్రతీ నెల కూడా డబ్బులు కావాలనుకునే మహిళలకు ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎన్‌సీడీలు
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లకు బాగా ఉపయోగపడతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం వల్ల మంచి రాబడి వస్తుందని భావిస్తారు. చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు మార్కెట్ రేట్ కంటే ఎక్కువ వడ్డీని ఇస్తాయి. 0.25% నుంచి 0.75% వరకు వడ్డీని ఇస్తాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కొంద రిస్క్ ఉంటుంది. కానీ దానికి తగ్గ రాబడి కూడా వస్తుంది.
ఇది కూడా చూడండి: Income Tax Bill 2025: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !