Trump Putin Clash: రష్యా- ఉక్రెయిన్‌ వార్‌.. ట్రంప్ పరువు తీసేసిన పుతిన్

రష్యా-ఉక్రెయిన్ వార్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోకర్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాల ముందు ట్రంప్‌ గాలి తీసేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేందుకు పుతిన్ ఒప్పుకోలేదు.

New Update
trump-putin

trump-putin

Trump Putin Clash: రష్యా-ఉక్రెయిన్ వార్(Russia Ukraine War) మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోకర్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాల ముందు ట్రంప్‌ గాలి తీసేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేందుకు పుతిన్ ఒప్పుకోలేదు. ఉక్రెయిన్‌లోని దొనెటెస్క్ ప్రాంతాన్ని అప్పగిస్తే యుద్ధం ఆపడంపై ఆలోచిస్తానని పుతిన్ తెలిపారు. అయితే పుతిన్‌తో భేటీ అనంతరం జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్ చేశారు. పుతిన్ డిమాండ్‌ను జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ నేతలకు ట్రంప్ వివరించారు. అయితే పుతిన్ డిమాండ్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించారు. సోమవారం జెలెన్‌స్కీతో సైతం ట్రంప్ భేటీ కాబోతున్నారు. అయితే ఇరు దేశాధినేతలు ట్రంప్ మాటలు వినడం లేదు. కాల్పుల విరమణ కుదిరే పని కాదని.. శాంతి ఒప్పందమే ఉత్తమం అంటూ ట్రంప్ యూటర్న్ మార్చారు. 

ఇది కూడా చూడండి: Alaska Meet: అలస్కా చర్చల్లో విజేత పుతిన్..ప్రపంచ నాయకుడిగా నిరూపణ

ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని..

యుద్ధం ముగించాలంటే తమకు కావాల్సిన కొన్ని డిమాండ్లు తీర్చాలని పుతిన్ కోరారు. రష్యా సరిహద్దుల్లో తూర్పున ఉక్రెయిన్‌లో డాన్‌బాస్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇందులో దొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌లు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతోంది. ఇది ఉక్కు ఉత్పత్తులు, బొగ్గు నిల్వలకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యాలోనే ఉంది. అయితే 2022లో ఎక్కువ భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఇందులో దొనెట్‌స్క్ 30 శాతం వరకు ఉక్రెయిన్‌లో ఉంది. ఈ మిగిలిన ప్రాంతాన్ని కూడా సొంతం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. 

జెలెన్‌స్కీతో భేటీ..

రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్‌ను గత మూడేళ్ల నుంచి డొనాల్డ్ ట్రంప్ ముగించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే భాగంగా ట్రంప్ అలస్కాలో పుతిన్‌తో భేటీ అయ్యారు. వీరి మధ్య చర్చలు  జరిగినా కూడా ఎలాంటి ఒప్పందం అయితే కుదరలేదు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలంటే రష్యా డైరెక్ట్‌గా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే బెటర్ అని భావిస్తు్న్నారు. ఈ క్రమంలోనే సోమవారం జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు.

ఇది కూడా చూడండి: Trade War: సుంకాలపై రాని క్లారిటీ..అమెరికా ప్రతినిధి బృందం భారత్ పర్యటన వాయిదా

Advertisment
తాజా కథనాలు