/rtv/media/media_files/2024/11/09/EpBNuv55XLiPRqBHwwUG.jpg)
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్ట్రాంగ్ నేత అనిపించుకున్నారు ప్రపంచ నేతగా నిలబడ్డారు. అలస్కా శిఖరాగ్ర సమావేశంలో తనదే పైచేయి అనిపించుకున్నారు. భేటీ ముందు బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామ్ గా వెనక్కు రావాల్సి వచ్చింది. తీవ్ర పరిణామాలు అని బెదిరించారు..పుతిన్ కు ఆహ్వానం పలుకుతూ తన సైనిక సామర్థ్యం బలుపును చూపించుకున్నారు కానీ అవేవీ పుతిన్ ముందు పని చేయలేదు. దాదాపు రెండున్నర గంటల పాటూ జరిగిన సమావేశంలో ఆయనదే పై చేయిగా కనిపించింది. భేటీ తరువాత జరిగిన మీడియా బ్రీఫింగ్ లో ఈ విషయం నిర్థారించబడింది. అందులో రష్యా అధ్యక్షుడే మొదటగా బ్రీఫింగ్ మొదలెట్టారు. దాదాపు 8.5 నిమిషాలు మాట్లాడి...70 శాతం ఆధిపత్యం చెలాయించారు. తరువాత ట్రంప్ మాట్లాడారు. పుతిన్ చెప్పినవాటిన్నటికీ తలూపుతూ...ఆయన వ్యాఖ్యలు లోతైనవిగా అభివర్ణించారు. ఇది ఒక్కటి చాలు పుతిన్ విజేత అని చెప్పడానికి విశ్లేషకులు అంటున్నారు. అసలు మొదటి నుంచీ పుతిన్ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారని అంటున్నారు.
పుతిన్ అంతిమ విజేత..
సమావేశంలో పుతిన్ విజేత అనడానికి ఐదు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో మొదటిది అమెరికా గడ్డపై ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించడం ఒకటి. ట్రంప్ మొదటి నుంచీ రష్యా ఒంటరిది అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఒకసారి పుతిన్ ను కలిశాక పూర్తిగా మారిపోయారు. ఆయనను ఎంతో ఉత్సాహంగా, ఒక ఉత్సవంలా ఆహ్వానించారు. పుతిన్‌ను ఒక పెద్ద ప్రపంచ నాయకుడిగా చూపించడానికి రాజకీయ దృక్పథాన్ని మార్చారు. దాంతో పాటూ అగ్రరాజ్య నేతతో కలిసి సమానంగా నిలబడడం ద్వారా పుతిన్ ఒక ప్రపంచ నాయకుడి హోదాను పొందారని అంటున్నారు.
ఇక భేటీలో ట్రంప్ ఒక్కసారి కూడా యుద్ధ విరమణ గురించి మాట్లాడలేదని తెలుస్తోంది. అసలు భేటీకి అదే కారణం అయినప్పటికీ దాని మీదనే చర్చ జరగలేదు. తరువాత కూడా అక్కడి చేరుకోలేదు, కొంత పురోగతి సాధించాము అంటూ ట్రంప్ తప్పించుకున్నారు. అంతా జెలెన్ స్కీ, నాటో చేతుల్లో ఉంది అని వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు మొదటి నుంచీ రష్యా ఏదైతే చెబుతూ వచ్చిందో దాన్నే ట్రంప్ కూడా ఇప్పుడు చెబుతున్నారు. భూమార్పిడి చేసుకోవాల్సిందే..ఉక్రెయిన్ ఒప్పుకోవాల్సిందే అని మాట్లాడుతున్నారు. పైగా మరోసారి చర్చలకు రష్యా వెళతాను అంటూ ట్రంప్ మాట్లాడడం పూర్తిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయాన్ని సూచిస్తోంది. దీనికి తోడు పుతిన్ తన వెంట వ్యాపారవేత్తలను వెంటబెట్టుకుని వచ్చారు. భేటీలో యుద్ధం గురించి కాకుండా రష్యా, అమెరికా మధ్య వ్యాపారాల గురించి డిస్కషన్ జరిగేలా చేశారు. దీనికి ట్రంప్ కూడా లొంగిపోయారు. ఆర్కిటిక్ సహకారాన్ని ప్రోత్సహించడంతో.. రష్యా తన సహజ వనరులను, ఉమ్మడి ఆర్కిటిక్ ప్రాజెక్టులను అమెరికాకు మంజూరు చేయాలని పుతిన్ ప్రతిపాదించింది. దీనికి అమెరికా అధ్యక్షుడు సుముఖం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇలా అన్ని రకాలుగా పుతిన్ తను అనుకున్నది సాధించి...భేటీలో విజేత తనే అని నిరూపించుకున్నారు. అలాగే ప్రపంచాన్ని శాసించే నాయకత్వ లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయని మరోసారి నిరూపించుకున్నారు. దీనిబట్టి చూస్తే ఉక్రెయిన్..రష్యా ముందు తలొంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Trade War: సుంకాలపై రాని క్లారిటీ..అమెరికా ప్రతినిధి బృందం భారత్ పర్యటన వాయిదా