/rtv/media/media_files/2025/05/07/QWKLLNrOEdKtt2DLR544.jpg)
Turkey, Azerbaijan back Pakistan after Operation Sindoor
మంగళవారం అర్ధరాత్రి దాటాక పాక్, POKలో ఉన్న ఉగ్రస్థావాలపై భారత సైన్యం వైమానిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరిట 9 ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసింది. అయితే పాకిస్థాన్‌కు మాత్రం రెండు దేశాలు మద్దతుగా నిలిచాయి. అవే టర్కీ, అజర్ బైజాన్. ఈ రెండు దేశాలు కూడా భారత్ చేపట్టిన దాడులపై వేరువేరుగా ప్రకటనలు చేశాయి.
Also Read: ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన.. ఉగ్రవాద స్థావరాల లిస్ట్ రిలీజ్
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించి టర్కీ విదేశాంగ మంత్రిత్వశాఖ ఎక్స్‌లో ప్రకటన చేసింది. '' భారత్-పాకిస్థాన్ మధ్య పరిణామాలను మేము ఆందోళనతో గమనిస్తున్నాం. గత రాత్రి భారత్‌చేసిన చేసిన దాడులు ఇరుదేశాల మధ్య యుద్ద ముప్పును పెంచాయి. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగడం, పౌరులకు, పౌర మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసి చేస్తున్న దాడులను మేము ఖండిస్తున్నామని'' టర్కీ తెలిపింది. అలాగే ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని చెప్పింది. పహల్గాం ఉగ్రదాడిపై విచారణ చేయాలని పాక్ చెప్పినప్పుడు కూడా టర్కీ పాక్‌కు మద్దతిచ్చింది.
Also Read: రైళ్లపై పాకిస్థాన్ నిఘా.. అప్రమత్తమైన రైల్వేశాఖ
మరోవైపు ఆపరేషన్ సిందూర్ జరిగాక అజర్ బైజన్ అనే చిన్నదేశం కూడా పాకిస్థాన్‌కు సపోర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. '' ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరగడంపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్‌పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నాం. ఈ దాడల్లో పలువురు పౌరులు కూడా మృతి చెందారని'' అజర్ బైజన్ విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే పాకిస్థాన్ ప్రజలకు సంఘీభావం తెలిపింది. దాడుల్లో మరణించిన కుటంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని.. వాళ్లు త్వరగా కోలుకోవాలని పేర్కొంది. మరోవైపు, భారత్, పాకిస్తాన్.. రెండూ కూడా సంయమనం పాటించాలని ఖతార్ కోరింది.
Also Read: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్‌పై హిమాన్షి రియాక్షన్!
Also Read: సిగ్గు లేదు.. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారులు (VIDEO)
Azerbaijan | india pakistan war | turkey | rtv-news