/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)
Trump
అమెరికా(America) లో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. అమెరికా ఇండస్ట్రీలలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దక్షణ కొరియా అమెరికాలో పెట్టుబడుల గురించి ఆలోచిస్తామని హెచ్చరించిన క్రమంలో ట్రంప్ ఇలా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రంప్ అధికారంలో వచ్చాక అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: సమానత్వం ఉంటే ఎందుకు మతం మారుతారు.. సీఎం సంచలన కామెంట్స్
Trump’s U-turn On Foreign Workers
ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్, మెక్సితో సహా తదితర దేశాల వారిని వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. మరికొందరిని నిర్బంధించారు. అయితే జార్జియాలో ఇటీవల 475 మంది అక్రమ వలసదారులను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన చేసింది. అక్కడ దక్షిణ కొరియా(south-korea ) కు చెందిన హ్యూండాయ్ కంపెనీ ప్లాంట్‌లో చాలామంది అక్రమంగా పనిచేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో అధికారులు సోదాలు నిర్వహించగా అందులో దక్షిణ కొరియా వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని నిర్బంధించారు.
Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా
ఈ విషయంలోనే అమెరికా, దక్షిణ కొరియా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. చివరికి సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సైతం దీనిపై స్పందించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మా వ్యాపార కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతాయంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Also read: ఈ అనుమానంతోనే లండన్‌లో నిరసనలు.. బ్రిటన్‌ని కదిలించిన ముగ్గురు పిల్లల చావు
'' విదేశాల కంపెనీలు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుంది. కొంతకాలం నిపుణులైన కార్మికులను మా దేశానికి తీసుకురావాలని నేను కోరుతున్నాను. వాళ్ల నుంచి మన కార్మికులు ట్రైనింగ్ తీసుకోవాలి. లేకపోతే భారీ పెట్టుబడుల(Investments) వల్ల ప్రయోజనం ఉండదు. మేము ఆ విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నామని'' ట్రంప్ అన్నారు.