/rtv/media/media_files/2025/09/06/howard-lutnick-2025-09-06-07-32-45.jpg)
Howard Lutnick
ఒకవైపు భారత్ తో సంధి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అమెరికా నేతలు మాత్రం తమ అక్కసును వెళ్ళగక్కకుండా ఆపుకోలేకపోతున్నారు. ఏ మాత్రం సందర్భం వచ్చినా ఏదో ఒక మాట అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్లూట్నిక్ మరోసారి ఇండియాపై కామెంట్స్ చేశారు. తమ దేశంలో 140 కోట్ల మంది ఉన్నారని గొప్పలు చెప్పుకునే భారత్ తమ దగ్గర గుప్పెడు మొక్క జొన్న కొనడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇలా చేస్తే తమతో వాణిజ్య ఒప్పందాలు, సుంకాలను తగ్గించాలనే విషయంపై ఆ దేశం కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని లూట్నిక్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో..భారత్, కెనడా, బ్రెజిల్ వంటి కీలక మిత్రదేశాలతో విలువైన సంబంధాలను సరిగ్గా నిర్వహిస్తున్నారా? అని అడగ్గా ఈ సమాధానం చెప్పారు.
న్యాయంగా వ్యవహరించడం లేదు..
తమ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు ఏక పక్షంగా ఉన్నాయంటూ కూడా హోవార్డ్ విరుచుకుపడ్డారు. వారు అమెరికాలో అన్ని ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ తమ దేశంలోకి మాత్రం మమ్మల్నిరానివ్వడం లేదని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉందని భారత్ గొప్పలు చెప్పుకొంటుంది. మరి.. మా మొక్కజొన్నలను ఎందుకు కొనరు? ఇది న్యాయమేనా? ప్రతిదానిపైనా సుంకాలు విధిస్తోంది. న్యాయంగా ఉండాలని.. పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు కానీ భారత్ మాత్రం వినడం లేదని ఆరోపించారు. అందుకనే సుంకాలు విధించామని లూట్నిక్చెప్పుకొచ్చారు. ప్రపంచంలో గొప్ప వినియోగదారుడి తో వ్యాపారం విషయంలో కష్టకాలం తప్పదని లుట్నిక్ వ్యాఖ్యానించారు.