Trump Tariffs: భారత్‌పై మళ్లీ టారిఫ్‌లు పెంచుతా.. ట్రంప్ సంచలన హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్‌ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) సంచలన హెచ్చరిక చేశారు. రష్యా(russia) చమురు విషయంలో భారత్‌(india) సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌(trump tariffs) లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుం 50 శాతం టారిఫ్ కొనసాగుతుండగా ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీకి కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. ఆయన్ని మంచి వ్యక్తిగా అభివర్ణిస్తూనే నన్ను సంతోషపెట్టడం భారత్‌కు ముఖ్యమని చెప్పారు. 

Also Read: చమురు వ్యాపారం కోసమే మదురో నిర్బంధం.. ట్రంప్ ప్లాన్ వెనుక సంచలన నిజాలు

Trump Tariffs Increased On India

రష్యాతో భారత్ వ్యాపారం కొనసాగిస్తే సుంకాలు వేగంగా పెంచుతామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను వైట్‌హౌస్‌ ఎక్స్‌లో షేర్ చేసింది. మరోవైపు రష్యా చమురు అంశంలో మాకు భారత్ సాయం చేయకుంటే టారిఫ్‌లు పెంచుతామని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు రాయిటర్ల్‌ తెలిపింది. 

Also Read: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్

ఇదిలాఉండగా భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ట్రంప్‌ మరోసారి భారత్‌పై సుంకాలు పెంచుతానని బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల క్రితం ట్రంప్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ తనతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అప్పట్లో ఈ అంశం తీవ్రంగా దుమారం రేపింది.   

Advertisment
తాజా కథనాలు