/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-08-35-14.jpg)
Trump announces US takeover of Venezuela’s oil sector
వెనెజువెలా(Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolás Maduro) ను నిర్భందించి అమెరికాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ని అదుపులోకి తీసుకున్నాక ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అందుకే అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాలు అందిస్తాయని తెలిపారు. మొత్తంగా వెనెజువెలాలోని చమురు రంగాన్ని తమ కంట్రోల్‌కు తెచ్చుకునేందుకు ట్రంప్ మదురోను నిర్బంధంలోకి తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
వాస్తవానికి వెనెజువెలాలోని 30,300 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ నిల్వల్లో దాదాపు ఇది దాదాపు 17 శాతం ఉంటుంది. అయితే అక్కడ రోజుకు 11 లక్షల బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే వెనెజువెలా బయటకు తీయగలుగుతోంది. అక్కడ చమరు రంగంలో ఎన్నోఏళ్లుగా పట్టించుకోకుండా ఉండటం, అవినీతి, అలాగే అంతర్జాతీయంగా ఆ దేశంపై ఆంక్షలు ఉండటంతో ఇలా తక్కువగా చమురు వెలికితీస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి మారాలంటే కొన్నేళ్ల పాటు సమయం పడుతుంది. భారీస్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుంది.
Also read: మహబూబ్‌నగర్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
Trump Announces US Takeover Of Venezuela’s Oil Sector
వెనెజువెలాలో రాజకీయ స్థిరత్వం లేకుంటే అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన కంపెనీలు, ఇతర విదేశీ కంపెనీలు ముందుకు రావు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణస్వీకారం చేశారు. ఎక్సాన్ మొబిల్, చెవ్రాన్ లాంటి పెద్ద చమురు కంపెనీలు కూడా వెనెజువెలాలో జరుగుతున్న పరిణామాలపై స్పందించలేదు. 2007లో అప్పటి వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ చమురు ఉత్పత్తిని చాలావరకు జాతీయం చేశారు. దీంతో ఎక్సాన్ మొబిల్, కొనొకోఫిలిప్స్ వంటి కంపెనీలు ఆ దేశాన్ని విడిచివెళ్లాల్సి వచ్చింది.
మరోవైపు వెనెజువెలాలో రాజకీయంగా పరిస్థితులు బాగుపడి సుస్థిర సర్కారు ఏర్పాటయ్యాక తమ వ్యాపారాలకు భరోసా ఇస్తే పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి. వెనెజువెలాలో ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీయడం అలాగే రష్యాపై ఒత్తిడి పెంచడం కోసం ఇది ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. వాస్తవానికి వెనెజువెలాలో భార ముడి చమురు ఎక్కువగా దొరుకుతుంది.
Also read: కరెంట్, ఆహారం లేక అల్లాడుతున్న వెనెజువెలా ప్రజలు
డీజిల్, అస్ఫాల్ట్‌లను భారీగా వాడే ఇతర ఇంధనాలను ఉత్పత్తి చేయడం కోసం భార ముడి చమురు అవసరం అవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఉంది. వెనెజువెలాల భార ముడి చమురును వెలికితీతను అమెరికా బయటకు తీయగలిగితే ఐరోపా, ఇతర దేశాలు రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపేయవచ్చు. ఇక వెనెజువెలాలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యి, అక్కడ చమురు ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Follow Us